ఖర్చులు తగ్గించుకునేందుకే:

భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించనున్నట్లు టెలీకమ్యూనికేషన్ పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది సిబ్బందిని ఇంటికి పంపనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అదనంగా స్వీడన్ లోని తన శ్రామిక శక్తిలో దాదాపు 1,400 మందిని తీసివేయాలని చూస్తున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు టెక్ కంపెనీల నుంచి ఎక్కువగా వింటున్న లేఆఫ్ లు, ప్రస్తుతం టెలికాం పరిశ్రమకూ వ్యాపించినట్లు అర్థమవుతోంది.

 వరుసగా నాలుగోసారి తగ్గిన ఆదాయం:

వరుసగా నాలుగోసారి తగ్గిన ఆదాయం:

“ఆయా దేశాల్లోని స్థానిక చట్టాలను అనుసరించి ఉద్యోగుల తొలగింపు కొంత భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని సిబ్బందికి విషయం తెలిపాం” అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్జే ఎఖోల్మ్ తన మెమోలో తెలిపారు. వరుసగా నాల్గవ త్రైమాసికంలోనూ సంస్థ ఆదాయం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. 5G పరికరాల అమ్మకాల్లో అధిక మార్జిన్ ఉన్న అమెరికాలోనూ సేల్స్ మందగించాయి. తద్వారా ఈ ఏడాది చివరి నాటికి 880 మిలియన్ డాలర్ల ఖర్చు తగ్గించుకోవాలని కంపెనీ చూస్తోంది. ఇందులో భాగంగానే లేఆఫ్ ల నిర్ణయం తీసుకుంది.

మార్జిన్ల తగ్గుదల ఎక్కువకాలం కొనసాగదు:

మార్జిన్ల తగ్గుదల ఎక్కువకాలం కొనసాగదు:

ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగుల సంఖ్యను కుదించడంతో పాటు కన్సల్టెంట్లు, రియల్ ఎస్టేట్ విభాగాల్లోనూ పొదుపు చర్యలు ప్రారంభించినట్లు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కార్ల్ మెల్లాండర్ గతంలో తెలిపారు. ఈ ఏడాది 6 నెలల వరకు మార్జిన్లలో తగ్గుదల ఉంటుందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం తాము తీసుకుంటున్న చర్యల ఫలితం రెండవ త్రైమాసికం నాటికి స్పష్టంగా తెలుస్తుందని అంచనా వేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *