News
oi-Mamidi Ayyappa
Meta
Layoff’s:
ఫేస్‌బుక్,
ఇన్‌స్టాగ్రామ్,
వాట్సాప్
మాతృ
సంస్థ
మెటా
వచ్చే
వారం
ఉద్యోగుల
తొలగింపులను
ప్రారంభిస్తున్నట్లు
ప్రకటించింది.
నెలలు
గడుస్తున్నా
ఉద్యోగాల
కోతలు
ఆగకపోవటంతో
చాలా
మంది
ఆందోళన
చెందుతున్నారు.
గురువారం
ఉద్యోగులతో
ప్రశ్నోత్తరాల
సెషన్‌ను
నిర్వహించిన
ఎగ్జిక్యూటివ్‌లు
తొలగింపులపై
క్లారిటీ
ఇచ్చారు.
తాజా
తొలగింపులు
మెటా
వ్యాపార
విభాగాలపై
ప్రభావం
చూపుతాయని
అలాగే
వేలాది
మంది
ఉద్యోగులు
ప్రమాదంలో
పడతారని
వెల్లడైంది.
ఇది
చాలా
ఆందోళనకరమైన,
అనిశ్చితితో
కూడుకున్న
సమయమని
మెటా
గ్లోబల్
అఫైర్స్
ప్రెసిడెంట్
నిక్
క్లెగ్
అభిప్రాయపడ్డారు.
తొలగించబడే
ఉద్యోగులకు
ముందుగా
తెలియజేస్తామని..
ఆ
తర్వాత
ప్రభావితం
కాని
ఉద్యోగులకు
సమాచారమిస్తామని
ఆయన
వెల్లడించారు.

ఈ
రౌండ్
తొలగింపుల
ఖచ్చితమైన
పరిధిని
కంపెనీ
ఎగ్జిక్యూటివ్‌లు
స్పష్టంగా
ధృవీకరించనప్పటికీ..
నవంబర్‌లో
11,000
స్థానాలను
తగ్గించిన
తర్వాత
మే
చివరి
నాటికి
10,000
స్థానాలను
తొలగించాలని
మెటా
యోచిస్తున్నట్లు
జుకర్‌బర్గ్
గతం
మార్చిలో
పేర్కొన్నారు.
మునుపటి
నెలలో
Meta
ఇప్పటికే
దాదాపు
4,000
స్థానాలను
తగ్గించింది.
అయితే
రాబోయే
రౌండ్‌లో
దాదాపు
6,000
స్థానాలు
ఎలిమినేషన్‌కు
గురయ్యే
అవకాశం
ఉందని
తెలుస్తోంది.
2022
చివరి
నాటికి
Metaలో
దాదాపు
86,000
మంది
ఉద్యోగులు
ఉన్నారు.
తొలగింపులకు
సంబంధించి
తదుపరి
వ్యాఖ్యలను
అందించడానికి
మెటా
ప్రతినిధి
నిరాకరించారు.
రాబోయే
తొలగింపుల
చుట్టూ
ఉన్న
అనిశ్చితి
సంస్థలో
ఇప్పటికే
సవాలుతో
కూడిన
వాతావరణానికి
అద్ధం
పడుతోంది.
అయితే
క్లెగ్
అటువంటి
పరిస్థితుల
నేపథ్యంలో
వారి
స్థితిస్థాపకత,
వృత్తి
నైపుణ్యం
కోసం
ఉద్యోగులను
ప్రశంసించారు.
English summary
Meta to start fresh round of layoffs in coming weekw amid global financial hard winds
Meta to start fresh round of layoffs in coming weekw amid global financial hard winds
Story first published: Friday, May 19, 2023, 12:15 [IST]