PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Lenskart: లెన్స్ కార్ట్ లో 500 మిలియన్ డాలర్ల ADIA పెట్టుబడులు.. వీటిని దేనికి వినియోగించనుందంటే..


News

lekhaka-Bhusarapu Pavani

|

Lenskart: ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిలోనూ వివిధ భారతీయ కంపెనీలు పెట్టుబడులను రాబట్టగలుగుతున్నాయి. ఇప్పటికే స్థాపించబడిన వాటితో పాటు స్టార్టప్ లు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు సమీకరించగలుగుతున్నాయి. దేశీయ ఎకోసిస్టం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వెరసి.. ప్రపంచంలో భారత్‌ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చింది అనడంలో సందేహం లేదు.

ADIAతో ఒప్పందం:

ADIAతో ఒప్పందం:

అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ దిశగా దేశీయ కళ్లజోళ్ల రిటైలర్ లెన్స్ కార్ట్ సిద్దపడుతోంది. ఇందుకు గాను 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీతో ఖచ్చిత ఒప్పందంపై సంతకాలు చేసినట్లు లెన్స్ కార్ట్ ప్రకటించింది. గతేడాది ఫండింగ్ కు ఇది అదనం అని స్పష్టం చేసింది.

సెకండరీ ఫండింగ్:

సెకండరీ ఫండింగ్:

ప్రారంభ మద్ధతుదారుల నుంచి ద్వితీయ వాటాల కొనుగోలు ద్వారా ఈ మొత్తాన్ని లెన్స్ కార్ట్ లో ADIA పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా 4.5 బిలియన్ విలువైన స్టార్టప్ గా అవతరించనుంది. డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫారం Tracxn ప్రకారం.. మొదటి, రెండవ రౌండ్లలో మొత్తం 1.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది.

ఇండియాలో అతిపెద్ద ప్లేయర్:

ఇండియాలో అతిపెద్ద ప్లేయర్:

సాఫ్ట్‌ బ్యాంక్, ఆల్ఫా వేవ్ వంటి గ్లోబల్ సంస్థల మద్దతుతో గత 12 సంవత్సరాలుగా లెన్స్ కార్ట్ అభివృద్ధి చెందుతోంది. మార్కెట్లో పోటీని తట్టుకుంటూనే.. ప్రీమియం గ్లాసెస్, ఇతర కళ్లజోళ్ల ఉత్పత్తులను దేశీయంగా సరసమైన ధరలకు అందిస్తోంది. తద్వారా ఈ విభాగంలో భారతదేశపు అతిపెద్ద ప్లేయర్‌లలో ఒకటిగా ఎదిగింది.

English summary

Lenskart signed definitive agreement with ADIA for $500 millions investment

Big investment into Lenskart

Story first published: Thursday, March 16, 2023, 14:03 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *