[ad_1]
పెట్టుబడుల విలువ..
లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల్లో గత కొన్ని సంవత్సరాలుగా మెుత్తం రూ.30,127 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఎల్ఐసీ వెల్లడించింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరల్లో భారీ అస్థిరతల నేపథ్యంలో నేడు ఒక వివరణను జారీ చేసింది. జనవరి 27 నాటి ముగింపు ధర ఆధారంగా అదానీ కంపెనీల్లో పెట్టుబడుల మార్కెట్ విలువ రూ.56,142 కోట్లుగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
IRDAI నిబంధనల ప్రకారం..
మెుత్తం అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో కేవలం 0.975 శాతమని ఎల్ఐసీ వెల్లడించింది. ఎల్ఐసీ అదానీ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని ఎల్ఐసీ వివరించింది. అదానీ డెట్ సెక్యూరిటీలన్నింటికీ రేటింగ్ ‘AA’లేదా అంతకంటే ఎక్కువ ఉందని స్పష్టం చేసింది.
పెట్టుబడుల వివరాలు..
ఎల్ఐసీకి అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో ఎల్ఐసీ 4,81,74,654 షేర్లు, అదానీ పోర్ట్స్ లో 19,75,26,194 షేర్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీలో 4,06,76,207 షేర్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో ఎల్ఐసీకి 2,03,09,080 షేర్లు ఉన్నాయి. నివేదిక విడుదలైన మెుదటి రెండు రోజుల్లో ఎల్ఐసీ రూ.16,580 కోట్లు నష్టపోయింది. దీంతో ఎల్ఐసీ స్టేక్ హోల్డర్లతో పాటు రాజకీయ నాయకులు, మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
[ad_2]
Source link
Leave a Reply