కాంగ్రెస్ ప్రభుత్వం..

యూపీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలను నిర్ణయించేందుకు ఉపయోగించిన ఫార్ములా వల్ల ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడిందని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని వెల్లడించింది.. మాజీ క్యాబినెట్ సెక్రటరీ కేఎం చంద్రశేఖర్. ఆయన రాసిన As Good As My Word: A Memoir అనే పుస్తకం ఆధారంగా బీజేపీ తాజాగా దీనిపై తన వాదనను వెలుగులోకి తెచ్చింది. ఈ పుస్తకంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల గురించి ఈ పుస్తకంలో రాశారు.

గ్యాస్ ధరలు..

దేశంలో గ్యాస్ ధరలను నిర్ణయించే ప్రక్రియలో చాలా తప్పులు జరిగాయని చంద్రశేఖర్ తన పుస్తకంలో వెల్లడించారు. ముఖేష్ గ్యాస్ ధర కోసం అటువంటి సూత్రాన్ని ముందుకు తెచ్చారన్నారు. ఆ సమయంలో ముడి చమురు రేటును పరిగణలోకి తీసుకుంటే.. గ్యాస్ ధర యూనిట్ కు 4.5 డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో అనిల్ అంబానీ పవర్ ప్లాంట్‌లకు 2.3 MMBTU చొప్పున గ్యాస్ సరఫరా చేయడానికి అంగీకరించిన ఒప్పందం జరిగింది. అయితే ప్రభుత్వ NTPC టెండర్ ఆధారంగా యూనిట్‌కు 2.3 డాలర్లుగా రేటు నిర్ణయించబడిందని చంద్రశేఖర్ వెల్లడించారు. తర్వాత ఆ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది.

ట్వీట్ ద్వారా..

ట్వీట్ ద్వారా..

చంద్రశేఖర్ తన పుస్తకంలో రాసిన విషయాలను ఆధారంగా తీసుకుంది బీజేపీ. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ..”రిలయన్స్ లాంటి ప్రైవేట్ సంస్థ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏని నియంత్రించింది” అంటూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అంబానీ ‘కాస్ట్ ప్లస్ ఫార్ములా ఉపయోగించాలి, ధర నిర్ణయించడంలో కాగ్ కూడా పాల్గొనాలి. రిలయన్స్ గ్యాస్‌ను $2.3 రేటుకు విక్రయించడానికి అంగీకరించినప్పుడు.. నాలుగు డాలర్ల కంటే ఎక్కువ ధరలో నాకు ఎలాంటి లాజిక్ అర్థం కాలేదంటూ కామెంట్ చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *