[ad_1]
|
e-రూపాయి వాడానోచ్:
“ఆర్బీఐతో జరిగిన బోర్డు సమావేశంలో డిజిటల్ కరెన్సీ e-రూపీ గురించి తెలుసుకున్నాను. మీటింగ్ అనంతరం పండ్ల వ్యాపారి బచ్చే లాల్ సహాని దుకాణానికి వెళ్లాను. డిజిటల్ రూపాయితో చెల్లింపులు అంగీకరించే వారిలో తను ఒకరు. దానిమ్మ పండ్లు కొని, e-రూపీతో చెల్లించాను. డిజిటల్ ఇండియా కార్యరూపం దాల్చింది” అని మహీంద్రా ట్వీట్ చేశారు.
చట్టపరమైన కరెన్సీ:
డిసెంబర్ 1, 2022న రిటైల్ డిజిటల్ e-రూపీని పైలట్ ప్రాజెక్టుగా వాడుకలోకి తీసుకువస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఇది చట్టపరమైన, డిజిటల్ టోకెన్ రూపంలోని టెండర్. నోట్లు, నాణేలను కేంద్ర బ్యాంకు విడుదల చేస్తున్న విధంగానే e-రూపాయినీ జారీ చేస్తోంది. స్మార్ట్ ఫోన్లలోని డిజిటల్ వాలెట్ ద్వారా ఈ లావాదేవీలను నిర్వహించే అవకాశం కల్పించారు.
బ్యాంకుల ద్వారానే..
కేవలం అధీకృత బ్యాంకులు అందించే వాలెట్ల ద్వారానే డిజిటల్ రూపాయి లావాదేవీలను జరపవచ్చు. రిటైల్ డిజిటల్ కరెన్సీని ప్రస్తుతం బ్యాంకుల ద్వారా మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈ పద్ధతిలో లావాదేవీలు వ్యక్తి -వ్యక్తి, వ్యక్తి-వ్యాపారికి మధ్య నిర్వహించబడతాయి. QR కోడ్‌లు ఉపయోగించి దుకాణాల్లో చెల్లింపులు చేయవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply