మార్కెట్ సూచీలు..
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 718 పాయింట్లు, నిఫ్టీ సూచీ 200 పాయింట్ల మేర భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 711 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 391 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు నేడు అదే తీరును కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది.

యూఎస్ జాబ్ డేటా..
అమెరికాలో వారాంతపు నిరుద్యోగులకు సంబంధించిన డేటా వెల్లడైంది. దీని ప్రకారం గడచిన 5 నెలల గరిష్ఠానికి ఈ సంఖ్య పెరిగిందని గణాంకాలు తెలిపాయి. ఇవి మాంద్యం తీవ్రతను ప్రతిబింబిస్తూ.. వాస్తవ పరిస్థితులకు అద్ధం పడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ తీవ్రంగా నష్టపోయాయి. ఇదే క్రమంలో భారతదేశంలో ఫిబ్రవరి నెల ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్ఠానికి చేరుకుంది.

టాప్ గెయినర్స్..
ఈ క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలోని బ్రిటానియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, కోల్ ఇండియా, హిందాల్కొ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.