News
oi-Chekkilla Srinivas
ఆర్థిక
మాంద్యం,
ఖర్చులు
తగ్గించుకోవడానికి
అంతర్జాతీయ
కంపెనీలు
ఉద్యోగులను
తొలగిస్తున్నాయి.
ఇప్పుడు
దేశీయ
కంపెనీలు
కూడా
ఉద్యోగుల
తొలగింపు
ప్రక్రియలను
మొదలు
పెట్టారు.
తాజాగా
ఈ
కామర్స్
కంపెనీ
అయిన
మీషో
251
మంది
ఉద్యోగులను
తొలగించినట్లు
శుక్రవారం
ప్రకటించింది.
ఇది
మొత్తం
వర్క్
ఫోర్స్
లో
15
శాతం.
గత
సంవత్సరం,
మీషో
దాదాపు
150
మంది
ఉద్యోగులను
తొలగించింది.
స్టార్టప్‌లు
నిధుల
సమీకరణకు
ఇబ్బంది
పడుతున్న
సమయంలో
ఈ
నిర్ణయం
తీసుకుంది.
“స్థిరమైన
లాభదాయకతను
సాధించడానికి
తక్కువ
మంది
ఉండే
సంస్థాగత
నిర్మాణంతో
పని
చేయాలి.
251
మంది
మీషోయిట్‌లతో
15%
ఉద్యోగులను
తొలగించాలని
మేము
కష్టమైన
నిర్ణయం
తీసుకున్నాము”
అని
మీషో
ప్రతిని
తెలిపారు.
ప్రభావితమైన
వారందరికీ
తమ
పూర్తి
మద్దతు
ఉందన్నారు.
2.5
నుంచి
9
నెలల
వన్-టైమ్
సెవెరెన్స్
చెల్లింపు
చేస్తున్నామని
ప్రకటించారు.
నిరంతర
బీమా
ప్రయోజనాలు,
జాబ్
ప్లేస్‌మెంట్
మద్దతు,
వేగవంతమైన
వెస్టింగ్‌తో
కూడిన
విభజన
ప్యాకేజీ
అందిస్తున్నామని
తెలిపారు.
మీషోను
నిర్మించడంలో
ఉద్యోగుల
సహకారానికి
కృతజ్ఞతలు
చెప్పారు.

గత
వారం,
జెఫరీస్
ఏడేళ్ల
ఇ-కామర్స్
స్టార్టప్‌పై
ఒక
నివేదికను
విడుదల
చేసింది.
2022లో
కంపెనీ
$4.5
బిలియన్ల
GMVని
నడుపుతోందని,
ఇది
ఒక
సంవత్సరంలో
తొమ్మిది
రెట్లు
వృద్ధిని
సాధించిందని
నివేదిక
పేర్కొంది.
కంపెనీ
ఖర్చులను
తగ్గించుకోవడానికి
దూకుడుగా
వ్యవహరిస్తోందని
తెలిపింది.
జెఫరీస్
నివేదిక
ప్రకారమే
మీషో
ఉద్యోగులను
తొలగించింది.
కంపెనీ
పబ్లిక్
ఆఫర్
కు
వెళ్లే
ముందు
2023
మధ్య
నాటికి
ఎబిట్డా-పాజిటివ్‌గా
మారేందుకు
కృషి
చేస్తోందని
సహ
వ్యవస్థాపకుడు
విదిత్
ఆత్రే
తెలిపారు.
ఉద్వాసనకు
గురైన
ఉద్యోగులు
వారి
మేనేజర్లతో
వ్యక్తిగతంగా
మాట్లాడే
వెసులుబాటు
కల్పిస్తున్నట్లు
వివరించారు.
ఉద్యోగుల
నియామకాల్లో
జాగ్రత్తగా
వ్యవహరించాల్సిందని
నొక్కి
చెప్పారు.
అలాగే
సిబ్బందిని
సమర్థంగా
వినియోగించుకోవడంలోనూ
కొన్ని
తప్పులు
జరిగాయని
అంగీకరించారు.
Tracxn
ప్రకారం,
మీషో
విలువ
$4.9
బిలియన్లుగా
ఉంది.
English summary
E-commerce company Meesho has laid off 251 employees
Due to the economic downturn, international companies are laying off employees to cut costs. Now the domestic companies have also started the process of dismissal of employees
Story first published: Friday, May 5, 2023, 15:09 [IST]