Mega Bonus: కట్టలు కట్టలుగా డబ్బు.. ఈ కంపెనీ ఇచ్చిన బోనస్ చూస్తే కళ్లు తిరిగుతాయ్..!

[ad_1]

కట్టలు కట్టలుగా..

కట్టలు కట్టలుగా..

చైనాలోని ఒక కంపెనీ పెద్ద పార్టీని నిర్వహించింది. అందులో కట్టలు కట్టలుగా డబ్బును స్టేజిపై పేర్చింది. రెండు మీటర్ల ఎత్తున డబ్బు కట్టలను పేర్చింది. కంపెనీ తన కంపెనీలోని టాప్ పెర్ఫార్మర్‌లకు మిలియన్ల యువాన్‌లను అందజేసింది. ఇందులో ఉద్యోగులు తమ బోనస్ మెుత్తాన్ని కట్టలు కట్టలుగా తీసుకెళ్లటం చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కంపెనీ వివరాలు..

సెంట్రల్ చైనాలో ఉన్న క్రేన్స్ తయారీ సంస్థ హెనాన్ మైన్ ఉద్యోగులకు ఊహించని బోనస్ అందించింది. కంపెనీ 2022లో మంచి లాభాలను ఆర్జించింది. మందగమనంలోనూ కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటంతో.. 40 మంది సేల్స్ మేనేజర్లకు మెుత్తం 60 మిలియన్ యువాన్లను బోనస్ గా అందించింది.

డబ్బుల పోటీ..

డబ్బుల పోటీ..

కంపెనీ ఉద్యోగులు నగదు లెక్కింపు పోటీలో కూడా పాల్గొన్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ కాగానే లెక్కించటం మెుదలు పెట్టారు. వారు లెక్కించగలిగేంత ఎక్కువ 100 యువాన్ నోట్లను గెలుచుకున్నారు. క్రేన్ తయారీలో హెనాన్ మైన్ కంపెనీ ప్రముఖ ఆటగాడిగా ఉంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మెత్తం 380 కార్యాలయాల్లో 2,700 మంది సిబ్బందిని కలిగి ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా..

ప్రపంచ వ్యాప్తంగా..

కంపెనీ తన ఉత్పత్తులను ఆస్ట్రేలియా, వియత్నాం, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా, పాకిస్తాన్, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మలేషియా, సింగపూర్, మాల్టా, తుర్క్‌మెనిస్తాన్, సౌదీ అరేబియా, పెరూ, ఇథియోపియాలో విక్రయిస్తోంది. కంపెనీ ఏటా 2.3 బిలియన్ల వరకు విక్రయాలను నమోదు చేస్తోంది.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *