Melatonin: మెలటోనిన్.. శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే హార్మోన్. మెదడులోని పీనియల్ గ్రంథి మెలటోనిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లీప్ సైకిల్, సిర్కాడియన్ రిథమ్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, నిద్ర విధానాలను నియంత్రించడానికి మెలటోనిన్ ఎంతో తోడ్పడుతుంది. మెలటోనిన్ నిద్ర నాణ్యతను మెరుగుపరచి, జ్ఞాపకశక్తిని పరోక్షంగా ప్రభావితం చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నారు. మంచి నిద్ర జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, అభిజ్ఞా పనితీరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పడానికి మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది.అయినప్పటికీ, మెలటోనిన్ సప్లిమెంటేషన్, జ్ఞాపకశక్తి మెరుగపడటం మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని గుర్తించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. దీనితో పాటు మెలటోనిన్ మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. శరీరంలో తగినంత స్థాయిలో మెలటోనిన్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ స్టోరీలో చూద్దాం.
Source link
