PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Meta: పేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు EU గట్టి షాక్.. బిలియన్ డాలర్లకు పైగా ఫైన్ ఎందుకంటే..


News

lekhaka-Bhusarapu Pavani

|

Meta:
ఫేస్‌బుక్
మాతృసంస్థ
మెటాకు
యూరోపియన్
యూనియన్(EU)
గట్టి
షాక్
ఇచ్చింది.
రికార్డు
స్థాయిలో
1.3
బిలియన్
డాలర్ల
మొత్తాన్ని
జరిమానాగా
విధించింది.
గోప్యతా
నిబంధనలను
ఉల్లంఘించడమే
దీనికి
కారణమని
తెలుస్తోంది.
అక్టోబర్
నాటికి
వినియోగదారుల
వ్యక్తిగత
సమాచారాన్ని
బదిలీ
చేయడాన్ని
నిలిపివేయాలని
ఆదేశించింది.
US
సైబర్‌
స్నూపింగ్
ను
దృష్టిలో
ఉంచుకుని

నిర్ణయం
తీసుకుంది.

ఐదు
సంవత్సరాల
క్రితం
EUలో
కఠినమైన
డేటా
గోప్యత
పాలసీ
అమల్లోకి
వచ్చినప్పటి
నుంచి
తాజాగా
విధించిన
జరిమానానే
పెద్దది
కావడం
విశేషం.
గతంలో
డేటా
రక్షణ
నియమాలు
మీరినందుకు
అమెజాన్
కు
2021లో
746
మిలియన్
డాలర్లను
EU
పెనాల్టీగా
వేసింది.
కాగా
ఇప్పుడు
మెటాను
1.2
బిలియన్
డాలర్లు
కట్టాలని
ఆదేశాలు
జారీ
చేసింది.

Meta: పేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు EU గట్టి షాక్.. బిలియన్ డాల

ఐరోపాలోని
తన
వినియోగదారులకు
సేవలు
నిలిపివేస్తామని
గతంలో
హెచ్చరించిన
మెటా..
EU
నిర్ణయాన్ని
నిలిపివేయాలని
కోరుతూ
కోర్టులో
అప్పీల్
చేస్తామని
ప్రకటించింది.
యూరోప్‌లో
ఫేస్‌బుక్‌
సేవలకు
ఎటువంటి
అంతరాయం
కలగలేదని

సంస్థ
తెలిపింది.
వినియోగదారుల
పేర్లు,
మెయిల్,
IP
అడ్రస్,
సందేశాలు,
హిస్టరీ,
జియోలొకేషన్
డేటాను
ప్రకటనల
కోసం
ఉపయోగించడంపై

నిర్ణయం
వెలువడింది.

అయితే
EU
నిర్ణయం
లోపభూయిష్టం,
అన్యాయమైనది
అని
మెటా
గ్లోబల్
అఫైర్స్
ప్రెసిడెంట్
మరియు
చీఫ్
లీగల్
ఆఫీసర్
జెన్నిఫర్
న్యూస్టెడ్
తెలిపారు.
EU
మరియు
US
మధ్య
డేటాను
బదిలీ
చేస్తున్న
లెక్కలేనన్ని
ఇతర
కంపెనీలకు
ఇదొక
ప్రమాదకరమైన
దృష్టాంతంగా
మారుతుందని
అభిప్రాయపడ్డారు.
US
సెక్యూరిటీ
సంస్థల
నిఘా
గురించి
ఎడ్వర్డ్
స్నోడెన్
వెల్లడించిన
అనంతరం
2013లో

ఆస్ట్రియన్
న్యాయవాది
చేసిన
ఫిర్యాదుకు
సంబంధించి
ఇది
కీలక
మలుపుగా
నిలిచింది.

English summary

EU fines Meta for not binding privacy norms

Meta: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాకు యూరోపియన్ యూనియన్(EU) గట్టి షాక్ ఇచ్చింది. రికార్డు స్థాయిలో 1.3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని జరిమానాగా విధించింది. గోప్యతా నిబంధనలను ఉల్లంఘించడమే దీనికి కారణమని తెలుస్తోంది. అక్టోబర్ నాటికి వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. US సైబర్‌ స్నూపింగ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఐదు సంవత్సరాల క్రితం EUలో కఠినమైన డేటా గోప్యత పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి తాజాగా విధించిన జరిమానానే పెద్దది కావడం విశేషం. గతంలో డేటా రక్షణ నియమాలు మీరినందుకు అమెజాన్ కు 2021లో 746 మిలియన్ డాలర్లను EU పెనాల్టీగా వేసింది. కాగా ఇప్పుడు మెటాను 1.2 బిలియన్ డాలర్లు కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఐరోపాలోని తన వినియోగదారులకు సేవలు నిలిపివేస్తామని గతంలో హెచ్చరించిన మెటా.. EU నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ కోర్టులో అప్పీల్ చేస్తామని ప్రకటించింది. యూరోప్‌లో ఫేస్‌బుక్‌ సేవలకు ఎటువంటి అంతరాయం కలగలేదని ఆ సంస్థ తెలిపింది. వినియోగదారుల పేర్లు, మెయిల్, IP అడ్రస్, సందేశాలు, హిస్టరీ, జియోలొకేషన్ డేటాను ప్రకటనల కోసం ఉపయోగించడంపై ఈ నిర్ణయం వెలువడింది. అయితే EU నిర్ణయం లోపభూయిష్టం, అన్యాయమైనది అని మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ లీగల్ ఆఫీసర్ జెన్నిఫర్ న్యూస్టెడ్ తెలిపారు. EU మరియు US మధ్య డేటాను బదిలీ చేస్తున్న లెక్కలేనన్ని ఇతర కంపెనీలకు ఇదొక ప్రమాదకరమైన దృష్టాంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. US సెక్యూరిటీ సంస్థల నిఘా గురించి ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన అనంతరం 2013లో ఓ ఆస్ట్రియన్ న్యాయవాది చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఇది కీలక మలుపుగా నిలిచింది.

Story first published: Wednesday, May 24, 2023, 8:55 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *