News
oi-Mamidi Ayyappa
Facebook Layoffs: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మెటా తన తొలగింపుల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. గతంలో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్లకు పంపిన మార్క్ జుకర్‌బర్గ్ యాజమాన్యం తాజాగా మరో అడుగు ముందుకేస్తోంది.
ఈవారం ప్రారంభంలోనే తాజా తొలగింపులను ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్లాన్ చేస్తోంది. ఈసారి కూడా వేల మందిలో టెక్ దిగ్గజం తన ఉద్యోగులను తగ్గించవచ్చని తెలుస్తోంది. దాదాపు నాలుగు నెలల కిందట సుమారు 11,000 మంది లేదా 13 శాతం ఉద్యోగులను తొలగించిన తర్వాత అమెరికా సంస్థ మళ్లీ ఉద్యోగుల తొలగింపులు చేపడుతోంది.

టెక్ దిగ్గజం కంపెనీకి అవసరం లేదు అని భావించిన బృందాలను పూర్తిగా తొలగిస్తోంది. ఇందులో భాగంగా మేనేజర్‌లకు ప్యాకేజీలను అందించడం ద్వారా తన సంస్థను “చదునుగా” చేస్తోంది. కంపెనీ తన ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది. ఈ దశ తొలగింపులను ఖరారు చేసే పనిలో ఉన్నవారు CEOమార్క్ జుకర్‌బర్గ్ మూడవ బిడ్డ కోసం పేరంటల్ సెలవుపై వెళ్లడానికి ముందే సిద్ధంగా ఉండాలని ఆశిస్తున్నారు.

గత సంవత్సరం నవంబర్ నెలలో ఊహించని భారీ తొలగింపుల తర్వాత మెటా ఉద్యోగులు తాజాగా మరో రౌండ్ తొలగింపులను ఎదుర్కోనున్నారు. టెక్ దిగ్గజం మెటావర్స్ సాంకేతికతపై దృష్టి సారించినందున కంపెనీకి ప్రాజెక్టు కోసం బిలియన్ల కొద్దీ ఖర్చవుతోంది. దీనికి తోడు కంపెనీ ప్రకటనల ఆదాయంలో క్షీణత నమోదైంది. దీంతో తప్పక ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో అనవసరమైన సిబ్బందిని మెటా తొలగిస్తోంది. గత నెలలో కంపెనీ వేలాది మంది ఉద్యోగులకు పేలవమైన పనితీరుతో ఉన్నట్లు రిపోర్టును అందించింది.
English summary
Facebook Mother company Meta to layoff 1000 employees in this week firing round know details
Facebook Mother company Meta to layoff 1000 employees in this week firing round know details
Story first published: Tuesday, March 7, 2023, 14:10 [IST]