[ad_1]
News
oi-Bogadi Adinarayana
మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ వెకేషన్ పాలసీని మరింత సరళీకరించినట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కాథ్లీన్ హొగన్ తెలిపారు. అమెరికాకు చెందిన తమ ఉద్యోగులకు అపరిమిత శెలవుల పాలసీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే కంపెనీ తన ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా విషయం తెలియజేసింది.
‘ఎలా, ఎప్పుడు, ఎక్కడ ఉద్యోగం చేయాలి అనే విషయం మన విచక్షణకు సంబంధించిన విషయం. అందుకనుగుణంగా మా వెకేషన్ పాలసీను ఆధునీకరించినట్లు చెప్పారు. కొత్త ఉద్యోగులు సైతం వెకేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. 10 కార్పొరేట్ సెలవులు, అనారోగ్యం, మానసిక ఆరోగ్య సమస్యలు, ఇతర అవసరాల కోసం అపరిమిత సెలవులను అందించడానికి నిర్ణయించాం. వినియోగించుకోని వెకేషన్ లీవ్ బ్యాలెన్స్‌కు ప్రతిగా ఏప్రిల్‌లో ఒక పర్యాయం చెల్లింపును పొందవచ్చు. అయితే ఈ కొత్త విధానం కేవలం జీతాలు తీసుకునే ఉద్యోగులకు మాత్రమే, కాంట్రాక్డు కార్మికులకు వర్తించదు’ అని వెర్జ్ నివేదిక పేర్కొంది
ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడానికి 2020లో మైక్రోసాఫ్ట్ అనుమతించింది. వారంలో సగభాగం స్వేచ్ఛగా ఇంటి నుంచి పని చేసుకోవడానికి అవకాశం కల్పించింది. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాకుండా నెట్‌ఫ్లిక్స్, ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్ మరియు లింక్డ్‌ఇన్ సైతం ఇదే తరహా పాలసీలను అందించనున్నట్లు సమాచారం.
English summary
Microsoft ammends its policy to unlimited vacation
Microsoft ammends the vacation policy
Story first published: Tuesday, January 17, 2023, 8:45 [IST]
[ad_2]
Source link
Leave a Reply