[ad_1]
ఉద్యోగులపై గొడ్డలి వేటు..
కంపెనీ మెుత్తంగా తన ఉద్యోగుల్లో 5 శాతాన్ని తగ్గించాలని నిర్ణయించింది. అయితే ఈ సారి కంపెనీ చేపడుతున్న ఉద్యోగుల తొలగింపు వల్ల దాదాపుగా 11,000 మంది కంపెనీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టెక్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపారాల నిర్వహణను మెరుగుపరుచుకోవచ్చని తెలుస్తోంది. మాంద్యం 2023లో తీవ్రతరం కానుందని నిపుణులతో పాటు కంపెనీలు సైతం అంచనా వేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టార్గెట్ ఎవరంటే..
యూఎస్ టెక్ దిగ్గజం ఈ సారి తన తొలగింపుల్లో భాగంగా ఇంజనీరింగ్, హ్యూమర్ రిసోర్సెస్ డిపార్ట్ మెంట్లలో పనిచేస్తున్న వారికి ఉద్వాసన పలకనున్నట్లు నివేదకలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని యూకేకు చెందిన SKY news వార్తా సంస్థ వెల్లడించింది. అయితే ఈ తొలగింపులు నేటి నుంచే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
కొత్త సంవత్సరం..
2023 ప్రారంభమైన తర్వాత మైక్రోసాఫ్ట్ తొలిసారిగా భారీ ఉద్యోగుల తొలగింపుకు ఉపక్రమించింది. దీనికి ముందు అక్టోబర్ 2022లో కంపెనీ దాదాపు 1000 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుంగిపోవటం దీనికి ప్రధాన కారణంగా కంపెనీ చెప్పుకొచ్చింది. ఈ వార్త ప్రచురితానికి ముందు 2023లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 104 టెక్ కంపెనీలు మెుత్తం 26,061 మంది ఉద్యోగులను తొలగించినట్లు Layoffs.fyi వెల్లడించింది.
[ad_2]
Source link
Leave a Reply