Monday, November 29, 2021

Mirabai Chanu : ఒలింపిక్స్‌లో భారత బోణీ మీరాబాయి చానుకు రూ.1కోటి నజరానా

India

oi-Srinivas Mittapalli

|

ఒలింపిక్స్-2021 క్రీడా సంగ్రామం మొదలైన రెండో రోజే భారత్‌కు రజత పతకం సాధించింది పెట్టింది మీరాబాయి చాను. మణిపూర్‌కు చెందిన 26 ఏళ్ల ఈ యువతి దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత్‌కు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మెడల్ సాధించి పెట్టింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి కాంస్య పతకం గెలవగా… మళ్లీ ఇన్నేళ్లకు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం తీసుకొచ్చింది.

మీరాబాయి చాను పతకం సాధించడంతో సొంత రాష్ట్రం మణిపూర్‌లో సంబరాలు జరుపుకుంటున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మీరాబాయి చానుకి రూ.1కోటి నజరానా ప్రకటించారు. ప్రస్తుతం రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్‌ ఉద్యోగంలో ఉన్న మీరాబాయి చానుకు ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘ఇక రైల్వే స్టేషన్లలో టికెట్లు కలెక్ట్ చేసే పని నీవు చేయవు. నీకోసం ఓ ప్రత్యేక పోస్టును రిజర్వ్ చేస్తున్నా.’అంటూ ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు.

manipur chief minister announce rs.1cr reward for mirabai chanu for winning medal in olympics

టోక్యోలోని ఒలింపిక్ విలేజ్‌లో శనివారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో చాను రజత పతకం సాధించింది. మొత్తం 202 కేజీల బరువు( (87 kg + 115 kg)ను ఆమె లిఫ్ట్ చేసింది. మొదటి స్థానంలో చైనాకు చెందిన హౌ జిహుయ్ నిలిచారు. జిహుయ్ 210 కేజీల బరువును లిఫ్ట్ చేశారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేయడం వల్లే ఈరోజు పతకం సాధించగలిగానని రజత పతకం సాధించిన తర్వాత మీరాబాయి వెల్లడించారు. 2017లో తాను వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం చాలా కష్టపడ్డానని… ఆ సమయంలో తన సోదరి వివాహానికి కూడా వెళ్లలేదని తెలిపారు. రియో ఒలింపిక్స్‌లో విఫలమయ్యాక వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఎలాగైనా సత్తా చాటాలన్న ఉద్దేశంతో కఠోర శ్రమ చేశానని తెలిపారు. శ్రమకు తగినట్లే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి మెడల్ సాధించారు. గతంలో కామన్ వెల్త్ క్రీడల్లోనూ పలు పతకాలు సాధించారు.

వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి సాధించిన పతకాలకు గాను గతంలోనే ఆమెకు పద్మశ్రీతో పాటు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు కూడా వరించాయి. తాజాగా ఆమె ఒలింపిక్స్‌లో సత్తా చాటడంతో మీరాబాయి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మీరాబాయి గెలుస్తుందని ముందుగానే ఊహించిన ఆ కుటుంబం బంధుమిత్రులు,సన్నిహితులతో కలిసి ఇంటి బయట టీవీ పెట్టుకుని ఒలింపిక్స్ వీక్షించారు.మీరాబాయి గెలవగానే సంబరాలు చేసుకున్నారు.

English summary

Mirabai Chanu, who opened India’s tally at the Tokyo Olympics on Day 2 with her silver medal in the women’s 49kg category, will get a reward of Rs 1 crore, Chief Minister of her home state Manipur, N Biren Singh, announced on Saturday.

Story first published: Saturday, July 24, 2021, 23:08 [IST]


Source link

MORE Articles

AP weather: ఏపీకి తుఫాను ముప్పు, 3న జవాద్, భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అలజడి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5...

Roborock Cyber Monday deals: Get a robot vacuum on the cheap today only!

A robot vacuum is one of the best investments you can make for your home. A good one can clean up your place...

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe