PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Modi: ప్రధాన మంత్రి మోడీతో సమావేశమైన బిల్ గేట్స్…


News

oi-Chekkilla Srinivas

|

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కలిశారు. ఆరోగ్యం, వాతావరణ మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. “ప్రపంచానికి చాలా సవాళ్లు ఉన్న సమయంలో, భారత్ వంటి డైనమిక్, సృజనాత్మక స్థలాన్ని సందర్శించడం స్ఫూర్తిదాయకం” అని బిల్ గేట్స్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో శుక్రవారం నాటి సమావేశంలో భారతదేశంలోని అసమానతలను తగ్గించడానికి సైన్స్, ఆవిష్కరణలు ఎలా సహాయపడతాయి అనే దానిపై చర్చించామని పేర్కొన్నారు.

“మహమ్మారి కారణంగా నేను గత మూడేళ్లుగా పెద్దగా ప్రయాణించనప్పటికీ, ప్రధాని మోడీ, నేను ప్రత్యేకంగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం, భారతదేశ ఆరోగ్య వ్యవస్థలలో పెట్టుబడులు పెట్టడం గురించి టచ్‌లో ఉన్నాము” అని గేట్స్ చెప్పారు. బిల్ గేట్స్ కలిసి కీలక అంశాలపై చర్చించామని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆరోగ్యం, అభివృద్ధి, వాతావరణం వంటి రంగాలలో భారతదేశం సాధిస్తున్న పురోగతిని బిల్ గేట్స్ ప్రశంసించారు.

Modi: ప్రధాన మంత్రి మోడీతో సమావేశమైన బిల్ గేట్స్...

“భారతదేశం చాలా సురక్షితమైన, సమర్థవంతమైన, సరసమైన వ్యాక్సిన్‌లను తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది, వాటిలో కొన్నింటికి గేట్స్ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది. భారతదేశంలో ఉత్పత్తి చేసిన టీకాలు మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ప్రాణాలను రక్షించాయి, ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యాధులను నిరోధించాయి” అని గేట్స్ చెప్పారు.

English summary

Microsoft co-founder Bill Gates met Prime Minister Narendra Modi on Friday

Microsoft co-founder Bill Gates met Prime Minister Narendra Modi on Friday. Health and climate change were discussed at length.

Story first published: Saturday, March 4, 2023, 13:27 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *