Tuesday, June 22, 2021

అగ్నిప్రమాద బాధితులకు ఎం.ఆర్. రెసిడెన్సీ వాసుల సహాయం

కాకినాడ: గత శుక్రవారం కాకినాడ గాంధీనగర్, సుబ్బారావు వీధిలో జరిగిన అగ్నిప్రమాదంలో కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలకు తమ వంతు సహాయంగా తిరుమలరావు వీధిలోని ఎం.ఆర్.రెసిడెన్సీ నివాసులు  మంగళవారం నిత్యావసర వస్తువులు అందించారు.

తిరుమల రావు వీధి లోని MR రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాసులు,  మరియూ ఈ వీధిలో నివాసం ఉండే దువ్వూరి సుబ్బారావు, రమేష్ చంద్ర లు కలసి ఈరోజు బాధితులకు అవసరమైన ఆహార సామగ్రి కొనుగోలు చేసి అందచేసారు.

ఇప్పటికే అదేవీధిలోని వాసవీ సౌగంధికా అపార్ట్మెంట్ వారు బాధిత కుటుంబాలకు బియ్యం, పప్పు దినుసులు వగైరాలు ఇచ్చియున్నారు.

మొదటగా  బాధితుల ఇళ్లపై కప్పుకొనుటకు, వారు తిరిగి ఇళ్లల్లో నివాసం ఉండేవిధంగా ప్లాస్టిక్ టార్పాలిన్ లు దాతలు ఇద్దామనుకున్నారు.
కానీ గోడలు నానిపోయాయి కప్పటానికి వీలవుతుందో లేదో అనే సంశయాన్ని వారు వ్యక్తం చేశారు.

ప్రస్తుతం వారికి వంట చేసుకోటానికి పాత్రలు కూడా లేవని, వాటిని ఇద్దామనుకున్నారు. కానీ ఇప్పటికే అవి ఎవరో కొంత సమకూర్చినట్లు తెలిసింది.
దీంతో ఆహార సామగ్రి ఇద్దామనుకుని నిర్ణయించుకున్న ఎం.ఆర్.రెసిడెన్సీ వాసులు ఈరోజు బాధితులకు వాటిని అందచేశారు.

రాజకీయ నాయకుల్లా, పబ్లిసిటీ లకు ఇష్టపడక, ఫొటోలు తీస్తే బాధితులు భాధ పడతారని మొదటగా భావించినా, ఇది ఇంకొకరికి ప్రేరణ కల్గించి, మరింత సహాయం బాధితులు పొందేందుకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుందని భావించి MR రెసిడెన్సీ వాసులు ఫొటోలకు అంగీకరించారు.

మనం ఒకరికి చేసిన సహాయం, మనకు భగవంతుడు ఇంకోరూపంలో అందిస్తాడు. కానీ ఏదీ ఆశించకుండా చేయటం మన ధర్మం అని MR రెసిడెన్సీ వాసులు పేర్కొనడం గమనార్హం.

ఈ కార్యక్రమాన్ని MR రెసిడెన్సీ సెక్రెటరీ దూసి.రామారావు గారి ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ వాసులు, మరో ఇద్దరు పెద్దలు నిర్వహించారు.

మరి ఒకరు సహాయం చేసేప్పుడు కొంత అవగాహన కోసం సహాయం చేసిన సామగ్రి వివరాలు దిగువ తెలియచేయటమైనది.
(25 కేజీ లలిత బ్రాండ్ మేలైన బియ్యం, నూనె ప్యాకెట్లు, పంచదార, కందిపప్పు, గోధుమ పిండి, ఉల్లిపాయలు, అల్లం, నిమ్మకాయలు, స్నానపు సబ్బులు, బట్టల సబ్బులు, ఆవాలు, చింతపండు, కారం, టీ పొడి, ఎండు మిర్చి, వెల్లుల్లిపాయలు, సేమ్యా, మసాలా ప్యాకెట్, జీలకర్ర, మరియూ వస్త్రములు)

ఈ కార్యక్రమంలో దూసి.రామారావు తో పాటు శ్రీరాం, శేషగిరిరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, సత్యధర్, సుధాకర్, శివుడు, నాగేంద్ర, సుబ్బారావు, రమేష్ చంద్ర, మరియూ లక్ష్మీ నారాయణ శర్మ లు పాల్గొన్నారు.

MORE Articles

Clubhouse is building a DM text chat feature – TechCrunch

Some Clubhouse users were treated to a surprise feature in their favorite app, but it wasn’t long for this world. A new UI...

HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models; terms of the deal were...

Kyle Wiggers / VentureBeat: HPE says it has acquired Determined AI, which is developing an open source platform for building machine learning models;...

టీఆర్ఎస్‌లోకి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు… హుజురాబాద్ ఉపఎన్నికవేళ మారుతున్న రాజకీయం…

హుజురాబాద్‌లో గెలుపు టీఆర్ఎస్‌దే -హరీశ్ రావు మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... హుజురాబాద్‌ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారని అన్నారు. 2001 నుంచి హుజురాబాద్‌...

हाई ब्लड प्रेशर को कंट्रोल में रखेंगी ये चीजें, हार्ट अटैक का खतरा भी होगा कम, डॉक्टर ने बताया सेवन करने का सही तरीका

नई दिल्ली: हार्ट अटैक एक ऐसी स्थिति है, जिसमें जान बचाना बेहद मुश्किल हो जाता है. इसकी सबसे बड़ी वजह अनियंत्रित हाई ब्लड...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe