కంపెనీ వ్యూహం..

రిలయన్స్ చేసిన తాజా పెట్టుబడుల వల్ల డ్రోన్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, రోబోటిక్స్ రంగాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో కంపెనీకి ఇది ఎంతగానో దోహదపడనుంది. Exynకి ఉన్న సాంకేతికతను వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు రిలయన్స్ గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి ముందు రిలయన్స్ దేశంలోని ఆస్టెరియా ఏరోస్పేస్, గ్లోబల్ రోజోటిక్ సంస్థ యాడ్వెర్బ్ టెక్నాలజీస్లోనూలలోనూ వాటాలు కొనటం ద్వారా పెట్టుబడి పెట్టింది.

Exyn వ్యాపార ప్రత్యేకత..

Exyn వ్యాపార ప్రత్యేకత..

Exyn పూర్తి-స్టాక్ సొల్యూషన్ సింగిల్ లేదా మల్టీ-రోబోట్‌ల అనువైన విస్తరణను అనుమతిస్తుంది. ఇవి తెలివిగా నావిగేట్ చేయగలవు, రియల్ టైంలో సంక్లిష్ట వాతావరణాలకు డైనమిక్‌గా అనుగుణంగా ఉంటాయి. GPS లేదా ఇతర నావిగేషన్ టెక్నాలజీలు లేకుండా కష్టమైన భూభాగాలను నావిగేట్ చేయడానికి డ్రోన్‌లు/రోబోట్‌లను ఎనేబుల్ చేసే ప్రముఖ స్వయంప్రతిపత్తి సాంకేతిక కలిగి ఉన్న సంస్థలో Exyn ఒకటిగా నిలుస్తోంది.

వరుస డీల్స్..

వరుస డీల్స్..

రిలయన్స్ ఇండస్ట్రీస్ గత వారం ఏకంగా మూడు వ్యాపార ఒప్పందాలను పూర్తిచేసింది. దీనిలో ముందుగా తమ్ముడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ కంపెనీని దక్కించుకోవటం కాగా.. రెండవది జర్మన్ రిటైలర్ మెట్రో బ్రాండ్ ఇండియా వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవటం.

దీనికి తోడు ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సాఫ్ట్‌వేర్-నిర్వచించిన వైడ్ ఏరియా నెట్‌వర్క్ 5 ఏళ్ల పాటు నిర్వహించటానికి జియో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ వ్యాపార విస్తరణలో చాలా దూకుడుగా ముందుకు సాగుతోంది.

ఇన్వెస్టర్లలో జోష్..

ఇన్వెస్టర్లలో జోష్..

గత వారం మార్కెట్లు ఎంత తీవ్రంగా నష్టపోయాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సమయంలోనూ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు మాత్రం స్వల్పంగానే నష్టపోయింది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.2,508.50 వద్ద ఉంది. రియలన్స్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్నందున ఇన్వెస్టర్లు కంపెనీ పనితీరును నిశితంగా గమనిస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *