[ad_1]
News
oi-Chekkilla Srinivas
ఎప్పటికప్పుడు షేర్ మార్కెట్‌లో అనేక ఆశాజనకమైన స్టాక్‌లు కనిపిస్తుంటాయి. ఇటువంటి స్టాక్‌లు కొన్నిసార్లు మల్టీబ్యాగర్‌గా మారతాయి. వాటి అంచనాలు బద్దలు కొట్టి పెట్టుబడిదారులకు భారీ రాబడిని అందిస్తాయి. అటువంటి స్టాకే డీప్ డైమండ్. ఇది దాని పెట్టుబడిదారులకు 1000 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. అంతేకాకుండా, స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ వరుసగా ఐదవ సెషన్‌కు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
బుధవారం (జనవరి 25) షేరు ధర రూ.18.45 వద్ద 5 శాతం ఎగువ సర్క్యూట్‌లో లాక్ అయింది. శుక్రవారం (జనవరి 27), పతనమైన మార్కెట్ మధ్య స్టాక్ మళ్లీ రూ.19.35 వద్ద ముగిసింది. మల్టీబ్యాగర్ స్టాక్‌ను కంపెనీ ఇటీవల 10:1 నిష్పత్తిలో విభజించింది. ఇంతకు ముందు షేరు ముఖ విలువ రూ.10 ఉండగా.. కంపెనీ విభజన తర్వాత డీప్ డైమండ్ ముఖ విలువ రూ.1గా మారింది.
కంపెనీలో మిగులు సొమ్మును పెట్టుబడి పెట్టేందుకు తమ బోర్డు నుంచి అనుమతి లభించిందని కంపెనీ ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా తెలియజేసినట్లు తెలిసింది. ఈ కంపెనీ తమ దగ్గర మిగిలిన డబ్బును ఇతర కంపెనీల షేర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి లేదా సబ్‌స్క్రయిబ్ చేయడానికి వాడనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), పవన, సౌరశక్తి వంటి గ్రీన్ ఎనర్జీ మరియు వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి కొత్త యుగం వ్యాపారాలపై ఈ కంపెనీ దృష్టి సారించింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందించిన ప్రోత్సాహాన్ని బట్టి EV రంగం అధిక వృద్ధి అవకాశాలను కలిగి ఉందని కంపెనీ తెలిపింది. మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ ఆబ్జెక్ట్ నిబంధనలో మార్పును డీప్ డైమండ్స్ బోర్డు ఆమోదించింది. డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు భారీగా 233.33 శాతం పెరిగి రూ. 1.5 కోట్లకు చేరుకున్నట్లు కంపెనీ నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం రూ.0.01 కోట్ల నుంచి రూ.0.61 కోట్లకు పెరిగింది.
Note: స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. వీటిలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.
English summary
Deep Diamond stock has returned 1000 percent in one year
From time to time many promising stocks appear in the share market. Such stocks sometimes become multibagger. They shatter expectations and deliver huge returns to investors. One such stock is Deep Diamond.
Story first published: Saturday, January 28, 2023, 17:26 [IST]
[ad_2]
Source link