Tuesday, May 17, 2022

కాకినాడ కార్పొరేటర్ హత్యపై పలు అనుమానాలు

కాకినాడ మున్సిపాలిటీ వైసిపి కార్పొరేటర్ కంపర రమేష్ 11 వతేదీ అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి కాకినాడ బీచ్ కి వెళ్లే రోడ్డులో గల ఒక కార్ సర్వీసింగ్ సెంటర్ వద్ద జరిగిన వివాదంలో గొడవ పెద్దదయి కారుతో పలుమార్లు ఢీకొట్టిన దారుణం అక్కడి సిసి కెమెరాల్లో చిక్కింది.

స్థానికుల కథనాల ప్రకారం కాకినాడ రూరల్ వలసపాకల వద్ద మున్సిపల్ వార్డ్ కార్పొరేటర్ కంపర.రమేష్ తన స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నారు. రెవెన్యూ కాలనీకి చెందిన చిన్నా రమేష్‌కి ఫోన్ చేశారు.. మాట్లాడే పని ఉందని రమేష్‌కు చెప్పారు. కార్పొరేటర్ వలసపాకల దగ్గర ఉన్నామని చెప్పడంతో చిన్నా సోదరుడు కుమార్ కారులో అక్కడికి వెళ్ళారు.

రమేష్, చిన్నా కొంత సేపు మాట్లాడిన తర్వాత రమేష్ వెళ్ళిపోతానని చెప్పడంతో, చిన్నా పుట్టినరోజు పార్టీ ఉందని వెళ్దామన్నాడు. కార్పొరేటర్ రావడం కుదరదని చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే చిన్నా కుమార్‌లు కారుతో రమేష్‌ను ఢీ కొట్టారు.. మూడుసార్లు కారును రమేష్ మీద నుంచి ఎక్కించారు. తర్వాత చిన్నా, కుమార్ కారులో పరారయ్యారు. తీవ్రగాయాలైన రమేష్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.. పాత కక్షలతో హత్య చేశారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

ఈ హత్యపై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి.

ఈ హత్యకు నాలుగురోజుల ముందునుంచే పథక రచన చేశారని, భూతగాదాలు ఇందుకు కారణం కావచ్చనీ, గతంలో జరిగిన లారీ యూనియన్ల గొడవలు కూడా కారణం కావొచ్చనీ, లేదా జరిగిన పార్టీలో మాటా మాటా పెరిగి మత్తులో అతి ఉద్రేకానికి గురయ్యి ఆవేశంలో హత్య చేసి వుండొచ్చనీ ఇలా పలు విధాలుగా ఈ హత్య గురించి స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుడు హత్యకు గురి కావటంతో పోలీస్ శాఖ నిందితుల్ని పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

కార్పొరేటర్ మృతిపై మంత్రి కన్నబాబు, శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి తో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేసారు. రమేష్ మృతి కాకినాడకు తీరని లోటని వారు అన్నారు.

ఏది ఏమయినప్పటికీ ఆవేశంలో చేసిన పనుల వల్ల ఇరువైపు కుటుంబ సభ్యులూ తీవ్ర విషాదం, అశాంతికి లోనుకావాల్సి వస్తుంది.

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe