Sunday, March 7, 2021

Must Watch: మార్స్‌పై అడుగుపెట్టిన పర్సెవరెన్స్ రోవర్: నాసా రిలీజ్ చేసిన అద్భుత ఫొటోలు, వీడియోలు

అరుణ గ్రహంపై ల్యాండైన పర్సెవరెన్స్ రోవర్..

కాగా, తాజాగా విడుదల చేసిన మూడు నిమిషాల ఇరవై ఐదు సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ‘పర్సెవరెన్స్’ రోవర్.. అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్ అయిన క్షణాలు రికార్డయ్యాయి. రోవర్ ల్యాండవుతుండగా అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, తాళ్ల సాయంతో వ్యోమనౌక నుంచి రోవర్ కిందికి దిగడం, శాస్త్రవేత్తలు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

అంగారక గ్రహంపై నిజంగా అద్భుత వీడియోలు

అంగారక గ్రహంపై ల్యాండింగ్ వంటి సంఘటనను మేము క్యాప్చర్ చేయడం ఇదే మొదటిసారి అని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ డైరెక్టర్ మైఖేల్ వాట్కిన్స్ అన్నారు.

‘ఇవి నిజంగా అద్భుతమైన వీడియోలు’ అని వాట్కిన్స్ చెప్పారు. తాము వారమంతా వాటిని ఎక్కువగా చూశామని తెలిపారు.

ఊహించినవిధంగానే రోవర్ పని..

నాసా సైన్స్ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ థామస్ జుర్బుచెన్ మాట్లాడుతూ.. పర్సెవరెన్స్ వీడియోలో “ప్రెజర్ సూట్ వేయకుండా మీరు అంగారక గ్రహంపైకి దిగడానికి దగ్గరి అవకాశాలు ఉన్నాయి.” అని తెలిపారు. ఇప్పటివరకు ఊహించిన విధంగా రోవర్ పనిచేస్తున్నట్లు పర్సవరెన్స్ ఉపరితల మిషన్ మేనేజర్ జెస్సికా శామ్యూల్స్ తెలిపారు. ‘పర్సెవరెన్స్ రోవర్ హెల్దీగా ఉందని నివేదించడానికి నేను సంతోషంగా ఉన్నాను. మేము వాటిని ప్లాన్ చేస్తున్నందున కార్యకలాపాలు కొనసాగుతున్నాము’ అని శామ్యూల్స్ చెప్పారు.

రోవర్‌లో 25 కెమెరాలు, రెండు మైక్రో ఫోన్లు..

పర్సెవరెన్స్ రోవర్ శుక్రవారం అరుణ గ్రహ ఉపరితలంపై దిగిన విషయం తెలిసిందే. ఈ రోవర్ రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రో ఫోన్లను ఇంజినీర్లు అమర్చారు. రోవర్ ల్యాండింగ్ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఇంజినీర్లు స్విచ్ ఆన్ చేశారు. రానున్న కొద్ది రోజుల్లోనే రోవర్ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు, వీడియో రికార్డింగ్స్ విడుదల చేస్తామని చెప్పిన మూడు రోజులకే నాసా తాజాగా ఈ వీడియోలు విడుదల చేసింది. ఇప్పటికే పర్సెవర్ అరుణ గ్రహ ఉపరితలానికి సంబంధించిన ఫొటోలు తీసి పంపిన విషయం తెలిసిందే. తాజాగా, కూడా రోవర్ దిగిన ఫొటోలను పంపింది.


Source link

MORE Articles

viral video: జగన్ సీటుకు ఎసరు -సాయిరెడ్డి పెద్ద బేకార్ -ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలనం

ఓవైసీ గ్రాండ్ ఎంట్రీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ కొనసాగుతుందని ఎంఐఎం పార్టీ ప్రకటించుకుంది....

ఖమ్మంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం: తాట తీస్తాం: ఫ్యాన్స్ ఫైర్: ఘాటుగా స్పందించిన షర్మిల

పార్టీ పేరును ప్రకటించదలిచిన జిల్లాలోనే.. ఏ జిల్లాలోనైతే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తొలి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారో, పార్టీ పేరును అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారో.. అదే...

घर में रखी इस चीज का सुबह से करें इस्तेमाल, होंगे जबरदस्त फायदे

नई दिल्लीः खुद को सेहतमंद रखने के लिए हम अक्सर कई चीजों का सेवन करते है. लेकिन आज हम आपको एक ऐसे घरेलू...

पुरुष इस समय रोज खाना शुरू कर दें मुट्ठी भर भीगे हुए चने, फिर जो होगा, यकीन नहीं करेंगे आप!

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं भीगे हुए चने के फायदे. भीगे हुए चने का सेवन पुरुषों के लिए ज्यादा...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe