NASA నా శక్తి సన్నగిల్లింది.. ఇక సెలవు: మార్స్‌పైకి నాసా ప్రయోగించిన ఇన్‌సైట్ రోవర్

[ad_1]

NASA భూమిని పోలి ఉన్న అంగాకర గ్రహంపై జీవరాశి ఉనికి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్స్‌పై అధ్యయనానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన ఇన్‌సైట్ రోవర్ నాలుగేళ్లుగా సేవలు అందిస్తోంది. అయితే, రోవర్ శక్తి తగ్గి, పనితీరు క్రమంగా నెమ్మదించినట్టు నాసా ట్వీట్ చేసింది. ఇన్‌సైట్ రోవర్‌ను 2018 మే 5న నాసా ప్రయోగించగా.. ఐదు నెలల ప్రయాణం అనంతరం అంగారక ఉపరితలంపై దిగింది. అప్పటి నుంచి అక్కడ వాతావరణానికి సంబంధించిన సమాచారం, ఫోటోలను పంపింది. తాజాగా, ఇన్‌సైట్ రోవర్ భూమికి పంపుతున్న చివరి ఫోటో ఇదే అంటూ నాసా ట్విట్టర్‌లో పేర్కొంది.

‘‘నా శక్తి చాలా తక్కువగా ఉంది కనుక ఇది నేను పంపే చివరి ఫోటో కావచ్చు.. అయితే నా గురించి చింతించకండి.. ఇక్కడ నా సమయం ఉత్పాదకంగా, ప్రశాంతంగా ఉంది. నేను నా మిషన్ బృందంతో మాట్లాడటం కొనసాగించడం సాధ్యమైతే చేస్తాను.. కానీ, నేను త్వరలోనే ఇక్కడ సైన్ ఆఫ్ అవుతాను.. నాతో ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని ఇన్‌సైట్ పేరుతో నాసా ట్వీట్ చేసింది. వాస్తవానికి ఈ మిషన్‌ను కాలపరిమితి రెండేళ్ల అయినా.. అదనంగా మరో రెండేళ్లు సేవలందించడం గమనార్హం.

నవంబరు 1న ఇన్‌సైట్ పనితీరు మందగించినట్టు నాసా తెలిపింది. త్వరలోనే ఇది మూగబోతుందని, అంగారకుడి రహస్యాలను బహిర్గతం చేసే మిషన్‌ ముగింపునకు సమయం ఆసన్నమైందని పేర్కొంది. ‘‘ఇన్‌సైట్ ల్యాండర్ మూగబోయే రోజు ఆసన్నమైంది… అరుణ గ్రహంలోపలి రహస్యాలను బహిర్గతం చేసి చరిత్ర సృష్టించే మిషన్‌కు ముగింపు పలుకుతోంది’’ అని నాసా తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

నవంబర్ 26న రోవర్ ట్వీట్ చేస్తూ ‘‘నేను రెండు గ్రహాలపై జీవించే అదృష్టం పొందాను… నాలుగు సంవత్సరాల కిందట రెండో గ్రహానికి సురక్షితంగా చేరుకున్నాను.. మొదటిసారి నేను పంపిన సమాచారం నా కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించింది.. నన్ను ఇక్కడకు పంపినందుకు నా బృందానికి ధన్యవాదాలు.. నేను ఈ ఆవిష్కరణ ప్రయాణంలో ఉన్నాను. నేను గర్వంగా చెప్పుకునేలా చేశానని ఆశిస్తున్నాను’’ అని పేర్కొంది. కాగా, రెండుసార్లు భూ కేంద్రం నుంచి కమ్యూనికేట్ చేసి ప్రయత్నాలు విఫలమైతే ఈ మిషన్ ముగిసినట్టు నాసా అధికారికంగా ప్రకటించనుంది.

సిస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జియోడెసీ, హీట్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించి మార్స్ అంతర్గత రహస్యాన్ని పరిశోధించిన మొదటి రోబోటిక్ ఇన్‌సైడర్. అంగారక గ్రహంపై భూకంప కార్యకలాపాల అధ్యయనం చేయడం దాని పరిశోధనలలో ఒకటి. అరుణ గ్రహంపై దిగినప్పటి నుంచి 1,300 కంటే ఎక్కువ భూకంపాల డేటాను సేకరించింది. అక్టోబర్ 2022లో ఇన్‌సైట్ 16-39 అడుగుల ఎత్తులో ఉన్న ఉల్క గ్రహాన్ని ఢీకొన్న తర్వాత రిక్టర్ స్కేల్‌పై 4 తీవత్రతో భూకంపాన్ని గుర్తించింది. భూమి కంటే మార్స్ మాంటిల్‌లో ఎక్కువ ఇనుము ఉందని ఇన్‌సైట్ పంపిన సమాచారంతో పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు.

నాసా ప్రకారం.. అంగారక గ్రహం అంతర్గత నిర్మాణాన్ని అధ్యయనం చేయడం వల్ల అంతర్గత సౌర వ్యవస్థలో రాతి గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో సమాధానం లభిస్తుంది.. ‘రాతి గ్రహాల నిర్మాణం, పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఇది సరైన ప్రయోగశాల’ అని తెలిపింది. ఇన్‌సైట్ రోవర్ విద్యుత్ ఉత్పత్తి సౌర ఫలకాలపై గాలితో కూడిన ధూళి గట్టిపడటం వల్ల శక్తి తగ్గుతూనే ఉందని నాసా పేర్కొంది.

Read Latest Science and Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *