News
lekhaka-Bhusarapu Pavani
NITI
Aayog:
ప్రపంచంలో
మేటి
ఆర్థిక
వ్యవస్థగా
భారత్
దూసుకుపోతున్న
విషయం
తెలిసిందే.
ప్రభుత్వం
అనుసరిస్తున్న
ఆర్థిక
విధానాలు
ఇందుకు
ప్రధాన
కారణంగా
భావించవచ్చు.
మే
27న
నీతి
ఆయోగ్
ఎనిమిదో
పాలక
మండలి
సమావేశం
జరగనుంది.
దీనికి
ప్రధాని
నరేంద్ర
మోడీ
అధ్యక్షత
వహించనున్నారు.
ఇందులో
ఆరోగ్యం,
నైపుణ్యాభివృద్ధి,
మహిళా
సాధికారత
మరియు
మౌలిక
సదుపాయాల
అభివృద్ధి
వంటి
అనేక
అంశాలపై
చర్చించనున్నారు.
‘విక్షిత్
భారత్
@
2047:
టీమ్
ఇండియా
పాత్ర’
అనే
ధీమ్
తో
మే
27,
2023న
8వ
గవర్నింగ్
కౌన్సిల్
సమావేశాన్ని
నిర్వహించనున్నట్లు
నీతి
ఆయోగ్
ఒక
ప్రకటనలో
తెలిపింది.
ప్రపంచంలోని
ఐదవ
అతిపెద్ద
ఆర్థిక
వ్యవస్థ
మరియు
అత్యధిక
జనాభా
కలిగిన
దేశంగా
భారత్
నిలిచిందని
గుర్తుచేసింది.
ఆర్థిక
అభివృద్ధి
పథంలో
ప్రస్తుతం
మంచి
దశలో
ఉందని,
రాబోయే
25
సంవత్సరాలలో
వేగవంతమైన
వృద్ధిని
సాధించగలమని
భావిస్తున్నట్లు
పేర్కొంది.

2047
నాటికి
విక్షిత్
భారత్
కోసం
8వ
గవర్నింగ్
కౌన్సిల్
సమావేశంలో
ఒక
రోడ్‌మ్యాప్‌ను
రూపొందించే
అవకాశం
ఉంది.
ఈ
మహా
యఙంలో
కేంద్రం
మరియు
రాష్ట్రాలు
టీమ్
ఇండియాగా
కలిసి
పని
చేస్తాయి.
“MSMEలు,
మౌలిక
సదుపాయాలు
మరియు
పెట్టుబడులు,
మహిళా
సాధికారత,
ఆరోగ్యం
మరియు
పోషకాహారం,
నైపుణ్యాభివృద్ధి
మరియు
ప్రాంత
అభివృద్ధి
మరియు
సామాజిక
మౌలిక
సదుపాయాల
కోసం
గతి
శక్తి
సహా
ఎనిమిది
ప్రముఖ
రంగాల
గురించి
ఇందులో
చర్చిస్తారు”
అని
నీతి
ఆయోగ్
ప్రకటించింది.
8వ
గవర్నింగ్
కౌన్సిల్
సమావేశానికి
ముందుగా
ప్రధాన
కార్యదర్శుల
స్థాయి
2వ
సమావేశం
జనవరి
2023లో
నిర్వహించబడింది.
విస్తృత
స్థాయి
వాటాదారుల
సంప్రదింపులు
మరియు
సబ్జెక్ట్
నిపుణులు,
విద్యావేత్తలు
మరియు
అభ్యాసకులతో
ఆలోచనాత్మక
సెషన్‌లు
కాన్ఫరెన్స్‌కు
ముందు
జరిగాయి.
తద్వారా
అట్టడుగు
స్థాయి
దృక్కోణాలను
కూడా
పరిగణలోనికి
తీసుకునే
అవకాశం
ఏర్పడినట్లు
తెలుస్తోంది.
ఇందులో
అన్ని
రాష్ట్రాల
ముఖ్యమంత్రులు,
కేంద్రపాలిత
ప్రాంతాల
లెఫ్టినెంట్
గవర్నర్లు
మరియు
పలువురు
కేంద్ర
మంత్రులు
సభ్యులుగా
ఉన్నారు.
ప్రధాని
మోడీ
దీనికి
ఛైర్మన్
గా
వ్యవహరిస్తారు.
English summary
NITIAayog Governing Council to meet on Saturday
NITIAayog Governing Council to meet on Saturday
Story first published: Friday, May 26, 2023, 8:11 [IST]