తాజా కూరగాయుల..

తాజా కూరగాయులు, ఆకు కూరలు ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి తోడ్పడతాయి. మీ డైట్‌లో బ్రకోలీని చేర్చుకుంటే.. లివర్‌లో కొవ్వు పేరుకోకుండా నిరోధించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలే, పాలకూర, బ్రస్సెల్‌ స్ప్రౌట్స్‌ వంటి కూరగాయలు ఫ్యాటీ లివర్‌ను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయి. (image source – pixabay)​

పాలు తాగరా..? ఈ 5 కాల్షియం రిచ్‌ ఫుడ్స్‌ మీ కోసమే..!

మీ డైట్‌లో సరైన కొవ్వులు చేర్చుకోండి..

మీ డైట్‌లో సరైన కొవ్వులు చేర్చుకోండి..

గ్లూకోజ్‌, ఒక రకమైన చక్కెర, కణాలు శక్తి కోసం దీన్ని ఉపయోగించుకుంటాయి. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, ఇది జీర్ణమైన ఆహారం నుంచి కణాలలోకి గ్లూకోజ్‌ని పొందడానికి సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న వ్యక్తులు తరచుగా ఇన్సులిన్ నిరోధకతనతో బాధపడుతుంటారు. ఇది ఇన్సులిన్‌ సరిగ్గా పని చేయని పరిస్థితి. కొన్ని కొవ్వులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, మోనోశాచురేటెడ్‌ తీసుకోవాలి. మీ డైట్‌లో చేపలు, కూరగాయల నూనె, అవిసె గింజలు, వాల్‌నట్స్‌, అవకాడో ఆలివ్‌ నూనె, విత్తనాలు చేర్చుకోండి. ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి సంతృప్త కొవ్వులు ఉండే.. డీప్ ఫ్రైడ్‌, ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

(image source – pixabay)

వెల్లుల్లి..

వెల్లుల్లి..

వెల్లుల్లి బరువు తగ్గడానికి, హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి సహాయపడుతుంది. మీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల NAFLD ఉన్నవారిలో కొవ్వు తగ్గుతుంది.​

Cancer Rate: యువతలో పెరుగుతున్న క్యాన్సర్‌ కేసులు.. వీరిలోనే ఎక్కువ..!

సరైన కార్బ్స్‌ తీసుకోండి..

సరైన కార్బ్స్‌ తీసుకోండి..

NAFLD ఉన్నవారు.. శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. చక్కెర ఆహారాలు, డెజర్ట్‌లు, ఎరేటెడ్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, సాస్‌లు, పాస్తాకు దూరంగా ఉండాలి. మీ డైట్‌లో గోధుమలు, బీన్స్‌, కాయధాన్యాలు వంటి సంక్లిష్టమైన, ఫైబర్‌ అధికంగా ఉండే పిండి పదార్థాలను తీసుకోవాలి.

(image source – pixabay)

గ్రీన్ టీ..

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి, ఫ్యాటీ లివర్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. గ్రీన్‌ టీ రోజూ తాగితే.. కొలెస్ట్రాల్‌ కరుగుతుంది, శరీరంలోని వ్యర్థాలు తొలగుతాయి.

(image source – pixabay)

పోషకాహారం తీసుకోండి..

పోషకాహారం తీసుకోండి..

శరీరంలో విటమిన్‌ డి లోపం కారణంగా.. ఫ్యాటీ లివర్‌ లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. మిటమిన్‌ డి పొందడానికి రోజూ ఉదయం, సాయంత్రం పూట 10 నిమిషాలు గడపండి. పోటాషియం లోపం NAFLDకి దారి తీస్తుంది. సార్డినెస్, సాల్మన్, సార్డినెస్, సాల్మన్ చేపలు, అరటిపండ్లు, చిలగడదుంపలు, అవకాడో పొటాషియం.

(image source – pixabay)

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *