News
oi-Mamidi Ayyappa
Ola S1 Scooter: ఓలా ఎలక్ట్రిక్ వాహనాల్లో లోపాలు తలెత్తటం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు వినియోగదారులు ఏకంగా స్కూటర్ ముందు చక్రం ఊడిపోవటం వంటి ఘటలను రిపోర్ట్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ రంగంలోకి దిగింది.
ఓలా ఎలక్ట్రిక్ మార్చి 14న భద్రతా సమస్యల కారణంగా కొత్త ఫ్రంట్ ఫోర్క్‌తో తమ స్కూటర్‌లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు కొనుగోలుదారులను అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ముందు Ola S1 ఫ్రంట్ ఫోర్క్ ఆర్మ్ భద్రత విషయంలో ప్రజల్లో కొన్ని ఆందోళనలు ఉన్నాయని రైడ్ షేరింగ్ కంపెనీ తెలిపింది.

కంపెనీ వెల్లడించిన ప్రకటనలో ఆరోపణలను తిప్పికొట్టింది. తాము ఓలా స్కూటర్ల తయారీలో అన్ని విడిభాగాలు, ఫ్రంట్ ఫోర్క్ తో సహా అన్నింటినీ తీవ్రమైన పరిస్థితుల్లో పరీక్షించబడినవని స్పష్టం చేసింది. వాహనాలపై ఉండే సాధారణ లోడ్‌ల కంటే చాలా ఎక్కువ భద్రతతో రూపొందించబడ్డాయని తెలిపింది.
Important update about your Ola S1! pic.twitter.com/ca0jmw1BsA
— Ola Electric (@OlaElectric) March 14, 2023
నిరంతర ఇంజినీరింగ్, డిజైన్ మెరుగుదల ప్రక్రియలో భాగంగా.. కంపెనీ ఇటీవలే ఫ్రంట్ ఫోర్క్ డిజైన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది మన్నిక, బలాన్ని మరింత మెరుగుపరుస్తుందని Ola వెల్లడించింది. ఫోర్క్ అప్‌గ్రేడ్ ఉచితంగా ఉంటుందని బెంగుళూరుకు చెందిన కంపెనీ వెల్లడించింది. అపాయింట్‌మెంట్ విండో మార్చి 22 నుంచి తెరవబడుతుందని కంపెనీ తెలిపింది.
English summary
Ola Electric announced Free front Fork Upgrading to S1 Pro Scooters, know details
Ola Electric announced Free front Fork Upgrading to S1 Pro Scooters, know details
Story first published: Wednesday, March 15, 2023, 15:03 [IST]