[ad_1]
అంకెల గారడీ..
తీవ్ర నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వంతో IMF సమావేశం కానుంది. సెప్టెంబరు నుంచి పెండింగ్ లో ఉన్న ఫండింగ్ అంశంపై కీలక చర్చ జరగనున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. అయితే 2022-23 బడ్జెట్ కు గాను ఆ దేశ ప్రాథమిక అంచనాల్లో 2 వేల బిలియన్ల మేరకు తప్పులు ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థ గుర్తించింది. ఫలితంగా బడ్జెట్ లోటు, ప్రాథమిక లోటు భారీ మార్జిన్‌తో పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కథనాలు వెలవడ్డాయి.
మినీ బడ్జెట్ కు వెళ్లండి..
పాకిస్థాన్ లో 2022-23 బడ్జెట్ సమయంలో GDP లో బడ్జెట్ లోటును 4.9 శాతం, ప్రాథమిక లోటును 0.2 శాతానికి పరిమితం చేయాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంకెల గారడీ కనిపిస్తున్నందున మినీ బడ్జెట్ ద్వారా 600 బిలియన్ల మేర అదనపు పన్ను వసూళ్లకు చర్యలు తీసుకోవాలని పాక్ అధికారులను IMF కోరుతున్నట్లు సమాచారం. కానీ వారు ఇందుకు అంగీకరించకుండా ప్రాథమిక లోటు అంత స్థాయిలో పెరగదని వాదించినట్లు తెలిసింది.
వరద ఖర్చుగా చూడండి ప్లీజ్..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లోటును లెక్కించే క్రమంలో.. 500 బిలియన్లను వరదల సమయంలో వెచ్చించిన ఖర్చుగా చూడాలని IMFను పాక్ కోరిందని నివేదిక వెల్లడించింది. ఇంధన ధరల సర్దుబాటు కోసం ఖర్చు చేసిన 65 బిలియన్ డాలర్లను సంకీర్ణ ప్రభుత్వం తిరిగి రాబట్టలేదని IMF గుర్తించింది. ఎగుమతులకు ఊతమిచ్చేందుకు రాయితీ మీద విద్యుత్, గ్యాస్ అందించడంతో 110 బిలియన్లు అవసరం పెరిగినట్లు తేలింది.
ఎందుకు IMF అంత ముఖ్యం ?
విదేశీ మారక నిలవలు అత్యంత తక్కువకు పడిపోయిన ప్రస్తుత తరుణంలో పాకిస్థాన్ ను రక్షించగల ఏకైక వేదిక IMF మాత్రమే. 3.7 బిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే ప్రస్తుతం వారి దగ్గర ఉన్నాయి. పాక్ డీఫాల్ట్ కాకుండా ఉండాలన్నా, ఆర్థిక సంక్షోభం తీవ్రత తగ్గాలన్నా IMFకు తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంది. 2019లోనూ 6 బిలియన్ డాలర్ల బెయిలౌట్‌ను దాయాది పొందింది.
2022లో భారీ వరదల వల్ల నష్టపోయిన దేశాన్ని ఆదుకోవడానికి మరో 1.1 బిలియ్ డాలర్లను IMF మంజూరు చేసింది. దేశంలోని రాజకీయ గందరగోళం కారణంగా ఆర్థిక స్వావలంబన దిశగా పురోగతి సాధించడంలో విఫలమవడంతో నవంబరు నుంచి ఈ చెల్లింపులను నిలిపివేసింది.
ప్రస్తుతం గట్టెక్కుతాం అంతే..
ప్రస్తుత రుణ ప్యాకేజీ జూన్ 30తో ముగియనుండగా.. కొత్త చిక్కులు లేకుంటే 3 బిలియన్ డాలర్ల వరకు నిధులు పొందనున్నట్లు పాకిస్థాన్ భావిస్తోందని అక్కడి ప్రముఖ వార్తా పత్రిక డాన్ పేర్కొంది. ప్రస్తుతమున్న చెల్లింపుల అవసరాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ మొత్తం సరిపోతుందని వెల్లడించింది.
రానున్న ఆర్థిక సంవత్సరానికి మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కోవడం తప్పదని అభిప్రాయపడింది. అందువల్ల IMF నిధులను పెంచాలని, చెల్లింపు వ్యవధిని సైతం పొడిగించాలని కోరుతున్నట్లు చెప్పింది. అయితే ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టడానికి ఇప్పటికీ దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించకపోవడంపై ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
[ad_2]
Source link