News
oi-Chekkilla Srinivas
ఎప్పటి నుంచో పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ కోరుతోంది. ఇప్పటికీ పాన్ తో ఆధార్ లింక్ చేయని ఉంటే చేసుకోవాలని కోరుతోంది. ఇందుకు మార్చి 31 చివరి తేదీగా నిర్ణయించింది. అప్పటికీ పాన్ తో ఆధార్ లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు పని చేయదని హెచ్చరించింది. ఇప్పటికే 510 మిలియన్ పాన్ కార్డులు ఆధార్ తో లింక్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా 100 మిలియన్లకు పైగా పాన్ కార్డులు ఆధార్ లింక్ కావాల్సి ఉంది.
ప్రస్తుతం పాన్ తో ఆధార్ లింక్ చేయాలంటే రూ. 1000 చెల్లించాలి. పాన్ తో ఆధార్ లింక్ చేయడం కేవైసీలో భాగమని చెబుతున్నారు. CBDT, SEBI వంటి నియంత్రణ సంస్థలు తమ ఆధార్, పాన్‌లను లింక్ చేయమని ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. గడువులోగా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకుంటే పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లు ప్రాసెస్ చేయరు. పని చేయని PANలకు రీఫండ్స్ రావు. ఇకపై రిటర్న్‌లను ఫైల్ చేయడానికి మీ PANని ఉపయోగించలేరు.

ఎలా లింక్ చేసుకోవాలంటే
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ వెళ్లాలి.
లింక్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయాలి.
మీ PAN వివరాలకు అనుగుణంగా మీ పుట్టిన తేదీ, జెండర్ నమోదు చేయాలి.
మీ ఆధార్ కార్డ్‌లో పేర్కొన్న వాటితో ఈ వివరాలను ధృవీకరించాలి.
రెండు వివరాలు సరిపోలితే, ఖాళీ ఫీల్డ్‌లో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి “లింక్ నౌ” బటన్‌పై క్లిక్ చేయాలి.
English summary
Pan card holders link pan card with aadhaar before 31 March 2023
March 31, 2023 is the last date for linking Aadhaar with PAN. If not linked before then PAN will not work.
Story first published: Saturday, March 18, 2023, 11:33 [IST]