pan: ‘పాన్‌’కు పట్టం కట్టిన కేంద్రం.. ఇకపై వాటన్నిటికీ బదులు పాన్ ఒక్కటి చాలు !

[ad_1]

News

oi-Bogadi Adinarayana

|

pan: ప్రభుత్వ ఏజెన్సీలన్నీ డిజిటల్ సిస్టమ్‌ లకు పాన్ నంబర్ ను ఉమ్మడి గుర్తింపుగా ఉపయోగించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దేశంలో ఈజ్ ఆఫ్ డూఇంగ్ బిజినెస్‌ ను మరింత ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రత్యేకమైన ఐడెంటిటీ లేకుండానే జాతీయ సింగిల్ విండో వ్యవస్థను వ్యాపారాలు వినియోగించుకునే అవకాశం ఈ విధానంలో లభిస్తుంది.

పలు ఐడెంటిటీల స్థానంలో..
వివిధ ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేయడానికి ప్రస్తుతం EPFO, ESIC, GSTN, TIN, TAN మరియు PAN వంటి 13 వ్యాపార IDలు ఉపయోగించబడుతున్నాయి. వీటన్నిటి స్థానాన్ని ఒక్క పాన్ భర్తీ చేయనుండటంతో.. పెట్టుబడిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయి. పలు రకాల గుర్తింపు వివరాలు అందజేయాల్సిన అవసరం లేకుండా పోతుంది.

pan: 'పాన్‌'కు పట్టం కట్టిన కేంద్రం.. ఇకపై వాటన్నిటికీ బదులు

ఇదీ చట్టం:
PAN అనేది ఒక వ్యక్తి లేదా సంస్థకు ఆదాయపు పన్ను శాఖ కేటాయించిన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖల నుంచి వేర్వేరు అనుమతులు పొందేందుకుగాను సింగిల్ విండో సిస్టమ్‌ లోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇందుకోసం పాన్ నంబర్‌ ను ప్రధాన గుర్తింపుగా ఉపయోగించేందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లో చట్టపరమైన నిబంధన ఉంది.

English summary

Finance minister announced PAN as the single business identity

Central government announcement about PAN identity

Story first published: Thursday, February 2, 2023, 8:13 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *