PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Pan-Aadhar link: పాన్-ఆధార్ లింకింగ్‌లో తప్పులు దొర్లాయా.. ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోండి!

[ad_1]

News

oi-Bhusarapu Pavani

|

Pan-Aadhar link: పాన్-ఆధార్ లింకింగ్ కోసం ప్రభుత్వం గడువు విధించిన విషయం తెలిసిందే. గతంలో మార్చి 31, 2023 చివరి తేదీగా నిర్ణయించగా.. దానిని ఇప్పుడు జూన్ 30, 2023 వరకు పొడిగించారు. అయితే ఈ ప్రక్రియలో, ఆధార్‌తో పాన్ కార్డు తప్పుగా జత చేయబడితే ఏం చేయాలో తెలుసా? పాన్ నుంచి ఆధార్‌ను ఎలా డీలింక్ చేయాలో తెలుసుకోండి మరి..

ప్రస్తుతం అనేకమంది ఈ తరహా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా పాన్-ఆధార్ లింక్ చేయడానికి ప్రయత్నించే వ్యక్తులను ఈ సమస్య వేధిస్తోంది. దీనిని సరిచేసుకుని, సరైన పాన్ మరియు ఆధార్ లింక్‌ను ప్రాసెస్ చేయడానికి.. మొదట తప్పుగా నమోదైన పాన్‌ను డీలింక్ చేయాలి. ఆపై రెండు డాక్యుమెంట్‌లను మళ్లీ జతే చేస్తే సరి.

Pan-Aadhar link: పాన్-ఆధార్ లింకింగ్‌లో తప్పులు దొర్లాయా..

పాన్-ఆధార్ డీలింకింగ్ కోసం పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫిర్యాదు, చిరునామా ధ్రువీకరణ, ఇ-మెయిల్ ను విధిగా దగ్గర ఉంచుకోవాలి. అనంతరం వివిధ సందర్భాల్లో ఏ విధంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలో చూద్దాం..

సర్వీస్ ప్రొవైడర్ నుంచి పాన్ కార్డు ప్రాసెసింగ్ వివరాలను సేకరించాలి. మొదటి, తదనంతర కేటాయింపుదారుల గుర్తింపు కోసం రిక్వెస్ట్ చేయాలి. అవసరమైన పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత కేటాయింపుదారులు కొత్త పాన్ కార్డుని అందుకోవచ్చు.

Pan-Aadhar link: పాన్-ఆధార్ లింకింగ్‌లో తప్పులు దొర్లాయా..

పాన్ కార్డు స్థితిని తనిఖీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ మొబైల్ అప్లికేషన్‌లోని CBN ప్రశ్నను ఉపయోగించాలి. రెండు కార్డులు యాక్టివ్‌గా ఉంటే, అవి ఇప్పటికే డీ-డూప్లికేషన్‌లో ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి. అదే జరిగితే, ఆదాయపు పన్ను అసెస్సింగ్ అధికారిని సంప్రదించాలి. ఇందుకోసం అవసరమైన పత్రాలను ఆ శాఖకు సమర్పించాలి.

పాన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి కార్డు ప్రాసెసింగ్ వివరాలను పొందాలి. RCC (ప్రాంతీయ కంప్యూటర్ సెంటర్) ద్వారా ITBA (ఆదాయ పన్ను వ్యాపార అప్లికేషన్) నుంచి ఆడిట్ లాగ్‌ సేకరించాలి. అవసరమైన పత్రాలను ఆదాయపు పన్ను శాఖకు అందించాలి.

ఇ-ఫిల్లింగ్ పోర్టల్ ప్రకారం, ఆధార్ తప్పు పాన్‌కి లింక్ చేయబడినప్పుడు డీలింక్ చేయడం కోసం JAOకి అభ్యర్థన సమర్పించవచ్చు. అనంతరం తిరిగి సరైన వాటిని జత చేసేందుకు మరోసారి రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం నిర్దేశిత ఫీజు చెల్లించాలి.

English summary

These are the ways to delink and relink Pan-Aadhar from wrong linking

Aadhar-Pan linking issues

Story first published: Thursday, March 30, 2023, 8:30 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *