Passport: ఆ దేశం పాస్‌పోర్ట్‌కు తిరుగేలేదు.. మరి మన స్థానమెక్కడంటే..?

[ad_1]

News

oi-Lekhaka

By Lekhaka

|

ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులరైన పాస్‌పోర్ట్‌ల జాబితాను హెన్లీ సంస్థ విడుదల చేసింది. ఇందులో జపాన్‌ మొదటి స్థానంలో నిలవగా ఆఫ్ఘనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. దీని ప్రకారం చూస్తే.. మొత్తం 227లో 193 దేశాలను జపాన్‌ పౌరులు వీసా లేకుండా చుట్టి రావచ్చన్నమాట. లండన్‌కు చెందిన హెన్లీ అండ్ పార్టనర్స్ అనే సంస్థ ఈ నివేదికను ప్రతి 3 నెలలకు విడుదల చేస్తూ చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్ డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్లు సంస్థ పేర్కొంది.

భారత్ విషయానికి వస్తే..
మొత్తం 109 స్థానాలతో పోలిస్తే.. 85వ మోస్ట్ పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌గా ఇండియా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 59 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని భారత పాస్‌పోర్టు కల్పిస్తోంది. గత నాలుగేళ్లుగా 82 నుంచి 85 మధ్య భారత్‌ ఊగిసలాడుతోంది. గతేడాదితో పోలిస్తే 3 స్థానాలు మెరుగుపరుచుకుంది.

Passport: ఆ దేశం పాస్‌పోర్ట్‌కు తిరుగేలేదు.. మరి మన స్థానమెక

అమెరికా అంతంత మాత్రమే..
జపాన్‌ తరువాత సింగపూర్‌, దక్షిణ కొరియాలు రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. జర్మనీ, స్పెయిన్ మూడవ, అగ్రరాజ్యం అమెరికా ఏడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా ఐదోసారి జపాన్ ఈ ఘనతను సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున ఉండగా, దాయాది పాకిస్తాన్ చివరి నుంచి 4వ స్థానంలో ఉంది. కేవలం 32 దేశాలకు మాత్రమే పాకిస్తాన్ పౌరులు వీసా లేకుండా ప్రయాణించవచ్చని అర్దం.

English summary

India place in passport index to travel without visa

World countries passport index for visa free travelling

Story first published: Thursday, January 12, 2023, 20:30 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *