News
oi-Mamidi Ayyappa
Paytm
News:
డిజిటల్
చెల్లింపుల
రంగంలో
దేశీయ
సంస్థ
పేటీఎం
శరవేగంగా
దూసుకుపోతోంది.
దీనికి
తోడు
ఇటీవల
విడుదలైన
నాలుగో
త్రైమాసిక
ఫలితాలు
ఇన్వెస్టర్లలో
కొత్త
ఉత్సాహాన్ని,
నమ్మకాన్ని
కలిగించాయి.

ఒక
పక్క
ఆదాయాలు
పెరగటంతో
పాటు
మరో
పక్క
నష్టాలు
భారీగా
తగ్గటం
ఇన్వెస్టర్లలో
లాభాల
ఆశలను
చిగురింపజేస్తోంది.
దీంతో
స్టాక్
గత
10
ట్రేడింగ్
సెషన్లలో
లాభపడుతూనే
ఉంది.
ఈ
క్రమంలో
స్టాక్
ధర
దాదాపు
10
శాతానికి
పైగా
వృద్ధి
చెందింది.
అలాగే
ఈ
రోజు
మార్కెట్లో
స్టాక్
5
శాతం
వరకు
లాభపడి
రూ.7236.60
వద్ద
ట్రేడవుతోంది.

ఇదే
సమయంలో
కంపెనీ
వ్యవస్థాపకుడు,
సీఈవో
విజయ్
చంద్రశేఖరన్
షేర్
హోల్డర్లకు
తన
మనసులోని
మాటలను
లేఖ
రూపంలో
పంచుకున్నారు.
తాము
కంపెనీని
లాభాల
బాట
పట్టించేందుకు
కృషి
చేస్తున్నట్లు
వెల్లడించారు.
ఆర్టిఫీషియల్
జనరల్
ఇంటెలిజెన్స్
వినియోగంలో
ఉన్న
అన్ని
అవకాశాలను
అందిపుచ్చుకునేందుకు
కృషి
చేస్తున్నట్లు
తెలిపారు.
టెక్నాలజీ
కంపెనీగా
పేటీఎం
ఈ
విప్లవంలో
ముందంజలో
ఉంటుందని
శర్మ
పేర్కొన్నారు.
Here
is
a
letter
to
@Paytm
shareholders
from
our
Founder
&
CEO
@vijayshekharhttps://t.co/OVaikarnVa
pic.twitter.com/eLb6vJ3nYO—
Paytm
(@Paytm)
May
7,
2023
కంపెనీ
EBITDA
(ESOP
ముందు)
లాభాన్ని
అందించిందని
శర్మ
ఆనందం
వ్యక్తం
చేశారు.
బాధ్యతాయుతమైన
చెల్లింపుల
సాంకేతికత
సంస్థగా
రెగ్యులేటరీ
కట్టుబడి
ఉంటూనే
వ్యాపార
నిర్మాణాన్ని
కొనసాగిస్తామని
తెలిపారు.
రిస్క్
మేనేజ్‌మెంట్,
నియంత్రణల
కోసం
సొంతంగా
తయారు
చేసుకున్న
టెక్నాలజీని
ఉపయోగించడం
గణనీయమైన
పోటీ
ప్రయోజనంగా
మారిందని
దృఢంగా
విశ్వసిస్తున్నట్లు
పేర్కొన్నారు.
English summary
Paytm Shares rocking in gains and CEO Vijay Shekhar Sharma releases letter to Investors
Paytm Shares rocking in gains and CEO Vijay Shekhar Sharma releases letter to Investors
Story first published: Monday, May 8, 2023, 15:15 [IST]