[ad_1]
సీఏపీఎఫ్ సిబ్బంది వాదన
అసిస్టెంట్ కమాండెంట్స్ గ్రూప్ ‘A’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. స్పెషల్ సెలక్షన్ బోర్డ్ జూన్ 2002లో జారీ చేసిన ప్రకటనను పిటిషనర్ల తరపున న్యాయవాది అంకుర్ చిబ్బర్ కోర్టుకు సమర్పించారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30, 2002 కాగా తుది ఫలితాలు జూలై, 2004లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
అక్టోబర్ 2004 నుంచి 2005 వరకు నియామక పత్రాలు జారీ చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. అయితే జనవరి 1, 2004 నుంచి కొత్తగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) అమలు చేయాలంటూ.. డిసెంబర్ 22, 2003లో నోటిఫికేషన్ వెలువడినట్లు చెప్పారు. అప్పటికే పాత పెన్షన్ పథకంలో సాయుధ బలగాలు కొనసాగుతున్నందున ఈ విధానం వర్తించదని వాదనలు వినిపించారు.
కేంద్రం తరపు స్పందన
డిసెంబర్ 2003లో ఎన్‌పీఎస్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. పిటిషనర్లు 2004-05 మధ్య ఉద్యోగంలో చేరారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది హరీష్ వైద్యనాథన్ శంకర్ కోర్టుకు తెలిపారు. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన అనంతరమే వారు అపాయింట్ అయినందున పాత పద్ధతికి అర్హులు కాదని వాదించారు.
కోర్టు నిర్ణయం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 మరియు 2003 డిసెంబర్‌లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లను పరిశీలించిన న్యాయస్థానం.. సాయుధ బలగాల సిబ్బంది ఓపీఎస్‌కు అర్హులని పేర్కొంది. ఈ సందర్భంగా.. దేశ రక్షణలో వారి పాత్రను ప్రశంసించింది. ప్రభుత్వాలు తీసుకునే విధాన పరమైన నిర్ణయాలు వారి ప్రయోజనాలకు ఆటంకం కాకుండా చూడాలని సూచించింది.
[ad_2]
Source link