Pharma Mutual Funds: ఫార్మా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!

[ad_1]

ఒత్తిడి

ఒత్తిడి

ఫండ్ మేనేజర్లు, విశ్లేషకుల ప్రకారం అనేక ఫార్మా కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో చాలా ఫార్మా స్టాక్ లు చౌకగా లభిస్తున్నాయి. దీంతో ఫార్మా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ పథకాలల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు గందరగోళానికి గురవుతున్నారు. గత ఒక సంవత్సరంలో, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ బెంచ్‌మార్క్ నిఫ్టీ 50లో 1% లాభాలతో పోలిస్తే 12.4% తగ్గింది. ఫార్మా స్టాక్‌లపై పందెం వేసే మ్యూచువల్ ఫండ్‌లు గత ఏడాది కాలంలో సగటున 14.2% పడిపోయాయి. వాల్యూ రీసెర్చ్ ప్రకారం, 2022లో ఇప్పటివరకు సగటున 12.4% క్షీణించాయి.

జెనరిక్స్

జెనరిక్స్

పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఈ రంగంలో వాల్యుయేషన్లు తగ్గాయని ఫండ్ మేనేజర్లు తెలిపారు. 2020లో యుఎస్ జెనరిక్స్ ఉధృతమైన ధరల ఒత్తిడిని చూడటం ప్రారంభించింది. పెద్ద కంపెనీలు USFDAతో సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. బ్రాండెడ్ జెనరిక్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, APIలు వాటి గరిష్ట స్థాయి నుంచి తగ్గాయి. దీనికి ముడి సరుకుల ధరలలో పెరుగుదల కూడా కారణంగా చెబుతున్నారు.

మెడికల్ టూరిజం

మెడికల్ టూరిజం

అయితే మెడికల్ టూరిజం సాధారణ స్థితికి వస్తోందని ఫండ్ మేనేజర్లు విశ్వసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సడలింపుల తర్వాత మెడికల్ టూరిజంలో పిక్-అప్ ఆసుపత్రులకు మార్జిన్‌లను పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇన్వెస్టర్లు తమ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలలో 5-10% ఫార్మా రంగానికి కేటాయించవచ్చని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తున్నారు. డైరెక్ట్ గా స్టాక్ ల్లో పెట్టుబడి పెట్టే బదులుగా ఫార్మా ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చని చెబుతున్నారు.

Note: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. వీటిలో పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ వార్తను గుడ్ రిటర్న్ ధృవీకరించడం లేదు. కేవల్ మార్కెట్ నిపుణుల అభిప్రాయాలు మాత్రమే ఇచ్చాం.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *