మరోసారి ముందుకొచ్చిన వాల్ మార్ట్
డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల యూనికార్న్ ఫోన్ పే.. మరో 200 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. తన అతిపెద్ద వాటాదారు వాల్ మార్ట్ నుంచి ఈ పెట్టుబడులను సాధించింది. ముందుగా నిర్ణయించిన బిలియన్ డాలర్ల నిధుల సమీకరణలో భాగంగా ఈ మొత్తాన్ని రాబట్టింది. తద్వారా 12 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ కు చేరనుంది.

టార్గెట్ లో ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్
ప్రస్తుత బిలియన్ డాలర్ల సమీకరణలో భాగంగా ఇప్పటికే జనరల్ అట్లాంటిక్ నుంచి 350 మిలియన్ డాలర్లు, టైగర్ గ్లోబల్ మేనేజ్ మెంట్ మరియు రిబ్బిట్ క్యాపిటల్ సహా TVS క్యాపిటల్ నుంచి మరో 100 మిలియన్ డాలర్లను రాబట్టింది. తదుపరి పెట్టుబడుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఫోన్ పే స్పష్టం చేసింది.

విస్తరణే లక్ష్యంగా..
భారత్ కేంద్రంగా సేవలు కొనసాగించే ఉద్దేశంతో ఇప్పటికే ప్రధాన కార్యాలయాన్ని ఇండియాకు మార్చింది. కొత్తగా సమీకరిస్తున్న నిధుల ద్వారా దేశీయంగా తన చెల్లింపుల వ్యవస్థ, బీమా వ్యాపారాలను మరింత మెరుగు పరచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటికి తోడు లెండింగ్, స్టాక్ బ్రోకింగ్, ONDC బేస్డ్ షాపింగ్ వంటి వివిధ విభాగాల్లో విస్తరించాలని చూస్తోంది.