లార్జెస్ట్ ఇండివిడ్యువల్ ఇన్వెస్ట్ మెంట్:

PhonePeలో పెట్టుబడులు పెట్టేందుకు Flipkart సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ సిద్ధమవుతున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. దాదాపు 100-150 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే, కొత్త తరం కంపెనీల్లో వ్యక్తిగత పెట్టుబడిగా రికార్డు సృష్టించనుంది. లార్జెస్ట్ ఇండివిడ్యువల్ ఇన్వెస్ట్ మెంట్ గా చరిత్రలో నిలిచిపోనుంది. Flipkartకు చెందిన మరో వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్ 2018లో Olaలో పెట్టిన రూ.100 కోట్ల వ్యక్తిగత పెట్టుబడే ఇప్పటివరకు అత్యధికం అని గమనించాలి.

పలు కంపెనీల ఆసక్తి:

పలు కంపెనీల ఆసక్తి:

అయితే బిన్నీ బాన్సాల్ పెట్టుబడి ఇంకా ఫైనల్ కాలేదని నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నట్లు పేర్కొంది. త్వరలోనే ఈ డీల్ పూర్తికానున్నట్లు చెప్పింది. బన్సాల్, టైగర్ గ్లోబల్, టెన్ సెంట్, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, మైక్రోసాఫ్ట్ వంటి Flipkart షేర్ హోల్డర్లు సైతం PhonePe లో వాటాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో బిన్నీ బన్సాల్ ఇన్వెస్ట్మెంట్ గురించిన వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అగ్రస్థానంలో వాల్ మార్ట్:

అగ్రస్థానంలో వాల్ మార్ట్:

Paytm, గూగుల్ పే, అమెజాన్ పే సహా ఇతర UPI నెట్వర్క్ యాప్ లకు ధీటుగా PhonePe పని చేస్తోంది. ఇప్పుడు 450 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పొందుతుండగా.. ఈ మొత్తాన్ని ప్రైమరీ క్యాపిటల్ గా ప్రైవేట్ ఈక్విటీల ద్వారా సాధించింది. జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, రిబ్బిట్ క్యాపిటల్ వంటి పలు కంపెనీలకు ఇందులో భాగముంది. తద్వారా 12 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించనుంది. అయితే 70% వాటాతో వాల్ మార్ట్ అతిపెద్ద పెట్టుబడిదారుగా కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *