నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి కిసాన్ యోజన 13వ విడత డబ్బులు బడ్జెట్‌కు ముందే విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లోనే 13వ విడత విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు పైసాలు రాలేదు. 13వ విడతకు సంబంధించి జనవరి 29న ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం విడుదల తేదీని ప్రకటిస్తారని అనుకుంటున్నారు.

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే డబ్బును పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా రైతులకు ప్రత్యేకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈకేవైసీ

ఈకేవైసీ

ఈ 13వ విడత డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకోకుంటే పైసాలు ఖాతాలో జమ కావు. ఇప్పటికీ ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. PM కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌లోకి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. వెబ్ సైట్ ఓపెన్ చేయగానే ఎడమ వైపు ఈ కేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది.

ఆధార్ లింక్

ఆధార్ లింక్

దానిపై క్లిక్ చేసి ఆధార్ లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. అప్పుడు మళ్లీ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సడ్మిట్ చేస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లే. ఏమైనా సమస్యలు ఎదురైతే.. హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 లేదా 011-23381092కు ఫోన్ చేయాలి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *