13వ విడత
13వ విడత త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.పలు మీడియా నివేదికల ప్రకారం, రైతులకు నూతన సంవత్సర కానుకగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత కోసం కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలను బదిలీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు.

e-KYC
అయితే ప్రధాన మంత్రి కిసాన్ యోజన ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులైన రైతులు తప్పనిసారిగా e-KYC చేసుకోవాలి. కొంత మంది రైతులు ఇప్పటికీ e-KYC చేసుకోలేదు. e-KYC లేని రైతులకు 12 విడత డబ్బులు కూడా రాలేదు. వారు ఇప్పటికీ ఈ కేవైసీ చేయించుకోకుంటే 13 విడత డబ్బులు కూడా రావని అధికారులు చెబుతున్నారు.

e-KYC ఇలా చేసుకోండి
– ముందుగా PM కిసాన్ యోజన pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
– వెబ్సైట్ కుడి వైపున ఇవ్వబడిన e-KYC ఎంపికపై క్లిక్ చేయండి.
-ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
-ఈ OTP మీ రిజిస్టర్డ్ నంబర్‌కు వచ్చిన తర్వాత, దాన్ని నమోదు చేయండి.
– ఆపై ‘సమర్పించు’పై క్లిక్ చేయండి. అప్పుడు e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.

అనర్హులు
కాగా చాలా అనర్హులు ఈ పథకం కింద లబ్ధీ పొందినట్లు అధికారులు తెలిపారు. వారిని గుర్తించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా అబ్ధి పొందిన అనర్హులు ఎక్కువగా ఉత్తర ప్రదేశ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఇన్ కామ్ ట్యాక్స్ కట్టే వారు అనర్హులు. కానీ తెలంగాణలో ఇచ్చే రైతు బంధుకు ఇలాంటి నిబంధనలు లేవు.