PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

pm kisan: రైతులకు కేంద్రం శుభవార్త.. ఏపీ కర్షకులకు మాత్రం డబల్ ధమాకా..


13వ విడత విడుదల:

PM కిసాన్ లబ్ధిదారులకు 13వ విడత నిధులను.. కర్ణాటకలోని బెళగావించి నుంచి ప్రధాని మోడీ సోమవారం విడుదల చేశారు. మొత్తం రూ.16 వేల కోట్ల ద్వారా 8 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందనున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని మొదటగా ప్రారంభించారు. ప్రతి 4 నెలలకు ఒకసారి.. సొంత పంటభూమి ఉన్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.2.2 లక్షల కోట్లను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కర్షకుల ఆదాయం పెంపునకు:

కర్షకుల ఆదాయం పెంపునకు:

రైతులకు పెట్టుబడికోసం కొంత మొత్తాన్ని సాయంగా అందించి, వారి ఆదాయాన్ని మరింత పెంచాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రంగ అభివృద్ధికి పీఎం కిసాన్ యోజన మరింత ఊతమిస్తుందని అభిప్రాయపడింది. కొన్ని ప్రమాణాలకు లోబడి, దేశంలోని రైతులందరూ ఈ పథకం కింద అర్హులేనని వెల్లడించింది. ఈ నిధులు గ్రామీణ ఆర్థికవృద్ధికి, రైతులకు రుణ పరిమితి సడలింపునకు, వ్యవసాయ పెట్టుబడిని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయని పేర్కొంది.

ఏపీ రైతులకు మరో శుభవార్త:

ఏపీ రైతులకు మరో శుభవార్త:

కేవలం వ్యవసాయం కోసమే కాకుండా పలువురు ఈ నిధులను విద్య, వైద్యం, సంరక్షణ, వివాహాలు వంటి ఇతర ఖర్చులను తీర్చుకోవడానికి సైతం వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన PM కిసాన్ లబ్ధిదారులకు రూ.2 వేలే కాకుండా కొంత ఎక్కువ మొత్తం అందనుంది. ఈ పథకానికి అదనంగా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం సైతం కొంత మొత్తాన్ని కలిపి కర్షకుల ఖాతాల్లో జమ చేయనుండడమే ఇందుకు కారణం. అతి త్వరలోనే ఈ మొత్తం రైతు ఖాతాల్లోకి చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *