[ad_1]
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
సీనియర్ సిటిజన్స్‌కు క్రమంగా ఆదాయాన్ని అందించాలనే ఉద్ధేశంతో ప్రధాన మంత్రి వయ వందన యోజనను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టింది. 60 ఏళ్లు దాటిన వారెవరైనా ఈ పథకంలో చేరవచ్చు. గరిష్ట వయస్సు నిబంధనలేమీ లేవు. ఒక సీనియర్ సిటిజన్ కిందనున్న అన్ని పాలసీల మొత్తం రూ.15 లక్షలకు మించకూడదు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే బెటర్
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కంటే పీఎంవీవీవైలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టడం, ఎల్‌సీఐ నిర్వహిస్తుండటం వల్ల ఎక్కువ మంది ఈ పథకంపై ఆసక్తి చూపిస్తున్నారు. పెన్షన్ వ్యవధిని సైతం వినియోగదారులే ఎంచుకునే అవకాశాన్ని పీఎంవీవీవై కల్పిస్తోంది. కోరుకుంటున్న పెన్షన్ ఆధారంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
ఏడాది, ఆరు, మూడు, నెల వారీ పెన్షన్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏడాదికి 12 వేల పెన్షన్ పొందాలంటే కనిష్టంగా రూ.1,56,658 వెచ్చించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల ద్వారా ఇందులో చేరవచ్చు. ఎల్‌ఐసీ రిజిస్టర్డ్ ఏజెంట్ నుంచి లేదా www.licindia.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
రుణ సదుపాయం
పాలసీ వ్యవధిలో దురదృష్టవశాత్తు పెన్షనర్ మరణిస్తే.. మొత్తం పెట్టుబడిని నామినీకి అందిస్తారు. మూడేళ్లు పూర్తయిన అనంతరం పాలసీ విలువలో గరిష్టంగా 75% వరకు రుణం పొందవచ్చు. ఈ పాలసీతో వినియోగదారుడు సంతృప్తి చెందని పక్షంలో 15 రోజుల్లోపు వాపసు చేయవచ్చు.
[ad_2]
Source link
Leave a Reply