National
oi-Madhu Kota
మినీ సంగ్రామంగా భావిస్తోన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల్లో అతికీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు ప్రశాంతంగా కొనసాగుతున్నది. వేటికవే ప్రత్యేక సంస్కృతులు, భాషలు కలిగిన ఈ నాలుగు ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశమిచ్చారు.
షాకింగ్: చిన్నమ్మను చంపేశారు -ఓటరు జాబితా నుంచి శశికళ పేరు తొలగింపు -ఈసీతో సర్కారు కుట్రన్న టీవీవీ
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. తమిళనాడు, కేరళ, యూటీ పుదుచ్చేరి అసెంబ్లీకి ఒకే విడతతో ఎన్నికలు జరుగుతుండగా, బెంగాల్లో మూడో విడత, అసోంలో చివరి విడత ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

ప్రజలు పోలింగ్‌కు కేంద్రాలకు తరలివచ్చి రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని, ముఖ్యంగా యువ ఓటర్లు ముందుండాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని బెంగాలీ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఆయన ట్వీట్లు చేశారు.
తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
దేశవ్యాప్తంగా 475 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30, తుది విడతలో అసోంలో 40, బెంగాల్లో మూడో విడతలో 31 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.