ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది..

శ్వాస వ్యాయామాలు.. ఆస్తమా, COPD వంటి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వ్యక్తులలో తీవ్రమైన లక్షణాలను నియంత్రించడానికి సహాయపడే నాన్‌ఫార్మాస్యూటికల్ టెక్నిక్. ప్రాణాయమం.. లైఫ్ క్వాలిటీ, ఊపిరితిత్తుల పనితీరు, తేలికపాటి ఆస్తమా ఉన్నవారిలో హైపర్‌వెంటిలేషన్ లక్షణాలను మెరుగుపరుస్తాయి. ప్రాణాయమం ఊపరితిత్తులను బలోపేతం చేస్తుంది, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.​

Health Care: టీతో బిస్కెట్‌ తింటున్నారా..? అయితే ఈ సమస్యలు వస్తాయ్‌ జాగ్రత్త..!

కీళ్ల నొప్పులు తగ్గుతాయ్..

కీళ్ల నొప్పులు తగ్గుతాయ్..

ప్రాణాయమం రోజు ప్రాక్టిస్‌ చేస్తే.. శరీరంలోని కణాలలో ఆక్సిజన్ మొత్తాన్ని పెంచుతుంది. ఇది కీళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రాణాయామం కండరాలు, కీళ్లను బలపరుస్తుంది. శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. కఠినమైన శారీరక శ్రమను తట్టుకునేలా.. బాడీ స్టామినా పెంచుతాయి.

High Calcium Foods:పాలు తాగరా..? ఈ 5 కాల్షియం రిచ్‌ ఫుడ్స్‌ మీ కోసమే..!

మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

మనిషి ఆలోచనలు, శ్వాసకు దగ్గర సంబంధం ఉందని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఒత్తిడికి గురైనపుడు తెలియకుండానే దీర్ఘశ్వాసలు వస్తాయి. ఊపిరి అందని భావనకు గురవుతుంటారు. ఈ రెండింటిని సక్రమంగా ఉంచేందుకు సరైన శ్వాస ప్రక్రియ కొనసాగాలి. శ్వాసవ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను చేకూర్చుతాయి.​

Hold in a sneeze: తుమ్ము ఆపితే.. తిప్పలు తప్పవు..!

జీర్ణక్రియకు మంచిది..

జీర్ణక్రియకు మంచిది..

ప్రాణాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి అపానవాయువు, ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణసమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ప్రాణాయామం GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) లక్షణాలను కూడా తగ్గిస్తాయి.

వృద్ధాప్య ఛాయలు రాకుండా..

వృద్ధాప్య ఛాయలు రాకుండా..

ప్రాణాయమం వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది. ఉదర కండరాలను బలోపేతం చేయడానికి, భంగిమను మెరుగుపరచడానికి, ముడతలను నివారించడానికి మరియు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ప్రాణాయామం శరీరంలో ఆక్సిజన్‌ సరఫరా పెంచుతాయి, ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

అభిజ్ఞా ఆరోగ్యాన్ని పెంచుతుంది..
ప్రాణాయామాలు రోజూ చేస్తే.. ఏకగ్రత, దృష్టి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. విషయాలను బాగా గుర్తుంచుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడతాయి. ప్రాణాయామం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించినSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *