Tuesday, May 24, 2022

Pulwama Terror Attack: రెండేళ్లు -NIA విఫలం -Interpol ఎంట్రీ -అమర జవాన్లకు కిసాన్ల నివాళి

Never Forget, Never Forgive

జమ్మూకాశ్మీర్ లోని పుల్వమా జిల్లా.. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం)లో 2019, ఫిబ్రవరి 14న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన 2500 మంది జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్‌ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఉగ్రదాడిని మరోసారి దేశం గుర్తు చేసుకుంటున్నది. అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటున్నది. దేశ రక్షణ, భద్రతలో తమ ప్రాణాలను వదిలిన సైనికులకు సెల్యూట్‌ చేస్తున్నది. పాక్ ముష్కరుల పనిపట్టాలని డిమాడ్ చేస్తున్నది. ఆదివారం ఉదయం నుంచి నెట్టింట Never Forget, Never Forgive (ఎప్పటికీ మరువొద్దు, ఎన్నటికీ క్షమించొద్దు) అనే నినాదం వైరల్ గా మారింది. కాగా,

వెంకయ్యను మళ్లీ లాగిన వైసీపీ -వీపీ మౌనమేల? పోస్కోతో జగన్‌కు లింకుల్లేవు: మంత్రి పెద్దిరెడ్డి

NIA విఫలం.. Interpol ఎంట్రీ

NIA విఫలం.. Interpol ఎంట్రీ

పుల్వామా ఉగ్రదాడిని పక్కా వ్యూహంతోనే అమలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తేల్చింది. సీఆర్పీఎఫ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్, తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. జాతీయ రహదారికి అనుబంధ మార్గం నుంచి అవంతీపొర సమీపంలో లాటూ గుండా అతడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాది, మొదటి బస్సును దాటుకుంటూ ఎడమ వైపు నుంచి ఐదో వాహనాన్ని ఢీకొట్టాడు. ఉగ్రదాడి జరగడానికి ముందు స్థానిక యువకులు దాదాపు 10 నిమిషాల పాటు సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై రాళ్లు రువ్వారు. ఈ సమయంలోనే పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకుంటూ వచ్చిన ఉగ్రవాది, సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిలోని ఐదో బస్సును ఢీకొట్టాడు. దాడికి అనువైన ప్రదేశాన్ని కూడా వ్యూహాత్మకంగానే ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదులు 300 కేజీల పేలుడు పదార్థాలను వాడారు. అందులో 80 కేజీలు ఆర్డీఎక్స్ ఉన్నట్లు గుర్తించిన ఎన్ఐఏ.. ఆ పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు ఎలా సేకరించారు? ఎవరి ద్వారా సరఫరా అయ్యాయి అనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు. ఎన్ఐఏ వైఫల్యంపై ఇటీవల కాలంలో విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ సంస్థ ఇంటర్ పోల్ సైతం తాజాగా..

ys sharmila ఊపుతో జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ -మళ్లీ సమైక్య రాష్ట్రం -వైఎస్ ఆశయం: జగ్గారెడ్డి సంచలనం

మసూద్ అజర్‌పై రెడ్ కార్నర్

మసూద్ అజర్‌పై రెడ్ కార్నర్

పుల్వామా ఉగ్రదాడి కేసులో భారత దర్యాప్తు సంస్థల వినతి మేరకు… అంతర్జాతీయ సంస్థ ఇంటర్ పోల్ రెండేళ్ల తర్వాతగానీ చర్యలకు ఉపక్రమించలేదు. పుల్వామా దాడికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్, అతని సమీప బందువులైన అబ్దుల రవూఫ్ అస్కర్, ఇబ్రహీమ్ అతహార్, అమ్మార్ ఆల్వీలకు ఇంటర్ పోల్ శనివారం నోటీసులు జారీ చేసింది. మసూద్ అజార్ పై రెడ్ కార్నర్ నోటీసులతోపాటు, అతని కీలక అనుచరులు ముగ్గురిపైనా గ్లోబల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఇంటర్ పోల్ నోటీసుల తర్వాతైనా పాకిస్తాన్ ప్రభుత్వం సరైన దిశలో స్పందించాలని ఎన్ఐఏ ఆశిస్తోంది. పుల్వామా దాడి కేసులో ఇప్పటికే డజను మందిని అరెస్టు చేసిన ఎన్ఐఏ.. దర్యాప్తును ఇంకా ముగించలేదు. కాగా,

జవాన్ల ప్రాణాలతో రాజకీయం..

జవాన్ల ప్రాణాలతో రాజకీయం..

పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, పాకిస్తాన్ కు మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎంఎఫ్‌ఎన్‌) హోదాను భారత్‌ ఉపసంహరించుకోవడం, ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్‌ నిర్వహించి, దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతం చేసినట్లు ప్రకటించడం, ఆపై రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం తెలిసిందే. కాగా, పుల్వామా ఉగ్రదాడిపై ప్రతిపక్షాలు, కొందరు నిపుణలు ముందు నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే రిపబ్లిక్ టీవీ యజమాని అర్నాబ్ గోస్వామి వాట్సాప్ సంభాషణల్లో పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ గురించి ముందే తెలుసని వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షాల అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. బీజేపీ సర్కారు జవాన్ల ప్రాణాలతో రాజకీయ చేస్తున్నదని, పుల్వామా దాడిని ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం, ఇటీవల గాల్వాన్ లోయలో చైనా చేతిలో హతమైన జవాన్లను కూడా భారత ప్రభుత్వం అవమానిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండం తెలిసిందే. ఇదిలా ఉంటే..

అమర జవాన్లకు కిసాన్ల నివాళి..

అమర జవాన్లకు కిసాన్ల నివాళి..

పుల్వామా ఉగ్రదాడికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అమరులైన జవాన్లకు ఊరూరా నివాళులు అర్పించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో దాదాపు మూడు నెలలుగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతు సంఘాలు ఈ మేరకు ప్రకటన చేశాయి. పుల్వామా విషాదకర ఘటనకు రెండేళ్లయిన సందర్భంగా ఫిబ్రవరి 14న దేశవ్యాప్తంగా రైతులు కార్యక్రమాలు నిర్వహిస్తారని, క్యాండిల్స్, కాగడాల ప్రదర్శన తదితర రూపాల్లో అమర జవాన్లకు నివాళులు అర్పిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ చెప్పారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe