PUMA: ప్యూమా కంపెనీపై అనుష్క శర్మ ఆగ్రహం.. తిరిగి బ్రాండ్ కోసం ప్రచారం.. ఏమైంది..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Anushka Sharma: బాలీవుడ్ నటి అనుష్క శర్మ నటనతో పాటు ముక్కుసూటిగా ఉంటారని కూడా పేరు తెచ్చుకుంది. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమాపై అనుష్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఒక ఫొటోను వినియోగించిందంటూ ప్యూమా ఇండియాపై అనుష్క విరుచుకుపడింది. అయితే సాయంత్రం ఆమె స్వయంగా ప్యూమా స్టోర్‌కు చేరుకోవడంతో వివాదంలో ట్విస్ట్ వచ్చింది. కంపెనీతో వివాదం చెలరేగినప్పటికీ ఆమె స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా ఇండియాకు ప్రచారకర్తగా ఉన్నారు.

కంపెనీతో గొడవపటం మళ్లీ ప్రమోట్ చేయటంపై నెటిజన్లు పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. అయితే ప్యూమా ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా అనుష్క శర్మపై సంతకం చేసింది. ప్యూమా ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తన ఫోటోను కూడా షేర్ చేసింది. అనుష్క-ప్యూమా ఇండియా మధ్య జరిగిన డీల్‌కు సంబంధించిన పత్రాలను షేర్ చేసింది. దీనికి ముందు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, కరీనా కపూర్, యువరాజ్ సింగ్, హార్డీ సిద్ధూ కంపెనీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోటర్లుగా వ్యవహరించారు.

PUMA: ప్యూమా కంపెనీపై అనుష్క శర్మ ఆగ్రహం..

భారతదేశంలో బ్రాండ్ ప్రమోషన్ కోసం ప్యూమా- విరాట్ కోహ్లీల మధ్య రూ.110 కోట్ల డీల్ జరిగింది. ఆ ఒప్పందం ఎనిమిది సంవత్సరాల కోసం జరిగిందని తెలుస్తోంది. విరాట్ తర్వాత ఇప్పుడు అనుష్క కూడా ఈ స్పోర్ట్స్ ఫ్యాషన్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా మారారు. తాను ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్ కాదని చెప్పిన అనుష్క సాయంత్రానికి స్వయంగా ప్యూమా స్టోర్‌కు చేరుకుంది. ప్యూమా దుస్తులను ధరించి చాలా ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చింది కూడా. ఇప్పుడు తాను కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది. అదే సమయంలో ప్యూమా ఇండియా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒప్పందం కాపీని కూడా షేర్ చేసింది. అయితే చాలా మంది మాత్రం ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు.

English summary

Bollywood Heroine Anushka Sharma Serious Over Puma India Know Full Details

Bollywood Heroine Anushka Sharma Serious Over Puma India Know Full Details

Story first published: Wednesday, December 21, 2022, 16:47 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *