PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Rahul Gandhi: అదానీ విషయంపై రాహుల్ ప్రశ్నాయుధాలు.. తెలుగు వ్యాపారిని ముంచి.. టార్గెట్ మోదీ..

[ad_1]

ప్రధాని మ్యాజిక్..

ప్రధాని మ్యాజిక్..

2014లో కుబేరుల జాబితాలో అట్టడుగున 609వ స్థానంలో ఉన్న అదానీ.. ప్రధాని మోదీ మ్యాజిక్ వల్ల 2వ స్థానానికి ఎదిగారని రాహుల్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ఆరో రోజు అదానీ హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత రాహుల్ చేసిన వ్యాఖ్యలు వ్యాపార ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గతంలో ప్రధాని అదానీ విమానంలో వెళ్లేవారని, ఇప్పుడు అదానీ పీఎం షిప్‌లో వెళ్లారని అన్నారు. ప్రధాని ఎన్నిసార్లు విదేశీ పర్యటనలకు అదానీ వెంట వెళ్లారో చెప్పాలంటూ రాహుల్ డిమాండ్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా..

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానితో సంబంధాలు మొదలయ్యాయని, అలా మోదీతో భుజం భుజం కలిపి నిలబడ్డ వ్యక్తి అదానీనేనని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ ప్రధాని అయిన తర్వాతే అసలు మ్యాజిక్ మెుదలైందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 8-10 రంగాల్లో అదానీ తన పెట్టుబడులను పెట్టారని రాహుల్ అన్నారు. విమానాశ్రయాల విషయంలో నిబంధనలు పక్కనపెట్టి అదానీకి కేంద్రం కట్టబెట్టిన విషయాన్ని రాహుల్ గాంధీ ప్రస్థావించారు.

అనుభవం లేకున్నా..

అనుభవం లేకున్నా..

నేల నుంచి నింగి వరకు అన్ని రంగాలకు విస్తరించిన అదానీ వ్యాపారాలు చివరికి అనుభవం లేకున్నా రక్షణ రంగంలో కంపెనీలు ఏర్పాటు చేయటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి ముందు అనిల్ అంబానీ కంపెనీకి గతంలో 126 విమానాల హెచ్‌ఏఎల్ కాంట్రాక్ట్ వెళ్లిందని రాహుల్ ధ్వజమెత్తారు.

ముంబై ఎయిర్ పోర్ట్..

తెలుగు రాష్ట్రాలకు చెందిన GVK వ్యాపార సంస్థ నుంచి అదానీ గ్రూప్ ముంబై విమానాశ్రయాన్ని పొందటంపై రాహుల్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ CBI, ED వంటి ఏజెన్సీలను ఉపయోగించి జీవీకే సంస్థ నుంచి ఎయిర్ పోర్టును బలవంతంగా లాక్కుని అదానీకి కట్టబెట్టిన విషయాన్ని ప్రస్థావించారు.

అలాగే అదానీ కోసం రూల్స్ మార్చి 6 విమానాశ్రయాలను అదానీకి కట్టబెట్టడాన్ని రాహుల్ తప్పుపట్టారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సమయంలో తాను కేవలం గౌతమ్ అదానీ అనే ఒక వ్యాపారవేత్త పేరు మాత్రమే విన్నానని ఆయన పార్లమెంట్ సాక్షిగా తెలిపారు.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *