రతన్ టాటా జననం..

డిసెంబర్ 28, 1937న రతన్ టాటా ముంబైలో జన్మించారు. నావల్ టాటా, సునీ టాటాలకు జన్మించిన రతన్ టాటా అమ్మమ్మ వద్ద పెరిగారు. 1959లో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివిన తరువాత.. కార్నెల్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1962లో ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత టాటా స్టీల్ కంపెనీలో తన వృత్తిని ప్రారంభించారు. సాధారణ ఉద్యోగిలా కార్మికులతో కలిసి జంషెడ్‌పూర్ బ్రాంచ్‌లో పనిచేశారు. రతన్ టాటా కూడా కంపెనీ పనిలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. అలా అందరి మన్ననలు పొందుతూ కుటుంబం అప్పగించిన బాధ్యతలను చేపట్టారు. అలా IBM ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు.

టాటా గ్రూప్ ఛైర్మన్ గా..

టాటా గ్రూప్ ఛైర్మన్ గా..

1991 రతన్ టాటాకు చాలా ముఖ్యమైనదని చెప్పుకోవాలి. ఎందుకంటే.. అప్పుడే ఆయన టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. చాలా మంది అప్పట్లో రతన్ టాటా ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించలేరని అభిప్రాయపడ్డారు. కానీ తన నైపుణ్యాలతో కంపెనీని 10,000 కోట్ల టర్నోవర్ స్థాయి నుంచి బిలియన్ డాలర్ల కంపెనీగా వృద్ధి చేశారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ 9 ఏళ్ల కాలంలో మెుత్తం 36 కంపెనీలను కొనుగోలు చేసింది. అలా అందరూ అసాధ్యం అన్న వాటిని రతన్ టాటా చేసి చూపించారు.

దేశీయ కార్..

దేశీయ కార్..

భారతదేశంలో 100% పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన కారును రతన్ టాటా ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. అలా ఉత్పత్తి చేసిన టాటా ఇండికాను మొదట 1998 ఆటో ఎక్స్‌పో, జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శించారు. ఇండికా పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉన్న మొదటి దేశీయ కారు కావటం విశేషం. అయితే ఆ తర్వాత బ్రిటిషన కంపెనీలైన జాక్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలను ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసి వ్యాపార ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు.

విమానం అంటే ఇష్టం..

విమానం అంటే ఇష్టం..

రతన్ టాటాకు విమాన ప్రయాణం అంటే చాలా ఇష్టం. 2007లో ఎఫ్-16 ఫాల్కన్‌ను నడిపిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు. పైగా ఆయనకు కార్లు అన్నా చాలా ఇష్టం. జేఆర్డీ టాటా ముద్ర రతన్ టాటాపై చాలా ఉంది కాబట్టి ఆయనకు విమానయానంపై ప్రత్యేక మక్కువ ఉంది. దీంతో భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాను తిరిగి ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించగా దానిని తిరిగి సొంతం చేసుకుని టాటాల గూటికి చేర్చారు. ఇప్పుడు దానిని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. మహారాజా ఈస్ బ్యాక్ అనే వార్తతో సంచలనం సృష్టించారు. పైగా ఆయన నవతరాన్ని ముందుకు నడిపేందుకు అనేక స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు కూడా.

రతన్ టాటా ఆస్తి..

రతన్ టాటా ఆస్తి..

అత్యంత సామాన్య జీవితాన్ని గడుపుతున్న రతన్ టాటా వేల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఐఐఎఫ్ఎల్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. రతన్ టాటా ఆస్తుల నికర విలువ దాదాపు రూ.3500 కోట్లుగా ఉంది. రతన్ టాటా తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని ఛారిటబుల్ ట్రష్ట్స్ ద్వారా ప్రజాసేవకు తిరిగి వినియోగిస్తున్నారు. ఇలా దేశంలోని ఆరోగ్య, విద్య రంగాలపై టాటాలు దృష్టి సారిస్తూ ఆసుపత్రులను సైతం నిర్మిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా జీవిత విశేషాలు చాలానే ఉన్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *