[ad_1]
QR వెండింగ్ మెషిన్లు..
దేశంలో QR కోడ్ ఆధారిత కాయిన్ వెండింగ్ మెషిన్లను తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది. వీటిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావటానికి ముందు పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని RBI యోచిస్తున్నట్లు ఎంపీసీ సమావేశంలో గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వీటి ద్వారా దేశంలో నాణేల పంపిణీని ప్రోత్సహించటంతో పాటు నాణేల లభ్యతను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎలా పనిచేస్తాయి..
రిజర్వు బ్యాంక్ ప్రవేశపెట్టనున్న వెండింగ్ మెషిన్లలో ఎవరైనా వ్యక్తి యూపీఐ ద్వారా QR కోడ్ స్కాన్ చేసి ఆ మెుత్తానికి నాణేలను పొందవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఉండే వెండింగ్ మెషిన్లు కరెన్సీ నోట్లను తీసుకుని వాటికి బదులుగా చిల్లర నాణేలను ఇస్తుంటాయి.
కానీ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ కీలకంగా మారినందున.. ఆర్బీఐ కొత్తగా యూపీఐ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ఖాతాదారుని అకౌంట్ డెబిట్ కు వ్యతిరేకంగా నాణేలు మెషిన్ నుంచి బయటకు వస్తాయి.
ప్రైలట్ ప్రాజెక్ట్..
రిజర్వు బ్యాంక్ ముందుగా ఈ మెషిన్లను దేశంలోని 12 నగరాల్లో ప్రారంభించాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ నుంచి నేర్చుకున్న అంశాల ఆధారంగా.. ఈ యంత్రాలను ఉపయోగించి నాణేల పంపిణీని ప్రోత్సహించడానికి బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేయబడతాయని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. G-20 దేశాల నుంచి ప్రయాణికులు వచ్చే ఎంపిక చేయబడిన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ముందుగా వీటిని RBI ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనుంది.
[ad_2]
Source link
Leave a Reply