PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

RBI: భారత్ ఆర్థిక వ్యవస్థపై శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు..


News

oi-Chekkilla Srinivas

|

భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉన్నట్లు కొచ్చిలో జరిగిన 17వ KP హోర్మిస్ స్మారక ఉపన్యాసంలో శక్తికాంత దాస్ పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 7 శాతం, వచ్చే సంవత్సరం 6.5 శాతం వృద్ధని నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గ్ అంచనా వేసిందన్నారు.

కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు ఇబ్బంది ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కాస్త ఇబ్బంది ఎదుర్కొంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందన్నారు. వాణిజ్యం, సాంకేతికత, మూలధన ప్రవాహాలు, లేబర్ మొబిలిటీ & గ్లోబల్ గవర్నెన్స్ బాగుందని దాస్ చెప్పారు. భారత్ రుణాలు తగిన మొతాదులోనే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

RBI: భారత్ ఆర్థిక వ్యవస్థపై శక్తికాంత్ దాస్ కీలక వ్యాఖ్యలు..

JAM (జన్-ధన్, ఆధార్, మొబైల్), UPI, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్‌తో కూడిన ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ‘లాస్ట్-మైల్ కనెక్టివిటీ’ సమస్యను పరిష్కరించడంలో భారతదేశం అగ్రగామిగా ఉందన్నారు. దేశంలో బ్యాకింగ్ రంగ కూడా బాగున్నట్లు ఆయన శక్తికాంత దాస్ తెలిపారు.

English summary

India Financial situation is stable said RBI Governor Shaktikanta das

Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das said the Indian economy is stable.

Story first published: Saturday, March 18, 2023, 8:02 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *