Recession 2023: కొత్త సంవత్సరం.. కొత్త కష్టాలు.. మాంద్యంతో మెుదలై ఆవేదన మిగులుస్తుందా..?

[ad_1]

అమెరికా టూ ఆస్ట్రేలియా..

అమెరికా టూ ఆస్ట్రేలియా..

ఇప్పటికే మాంద్యం ఎదుర్కొంటున్న అమెరికా, ఆస్ట్రేలియాలోని ప్రజలు తమ ఖర్చులను భారీగా తగ్గించుకుంటున్నారు. ఇది మార్కెట్లలోని డిమాండ్ ను అమాంతం తగ్గిస్తోంది. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ 2022లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు దాదాపు 14 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి విలువను కోల్పోతారని, 2023లో మాంద్యం కారణంగా అదే 100 ట్రిలియన్ డాలర్ల పరిధిలో స్తబ్దుగా ఉంటుందని అంచనా వేసింది.

ద్రవ్యోల్బణం..

ద్రవ్యోల్బణం..

సెంట్రల్ బ్యాంకులు రేట్లను క్రమంగా పెంచుతున్నప్పటికీ.. ప్రపంచ దేశాలు ఇంకా ద్రవ్యోల్బణంతో పోరాడుతూనే ఉన్నాయి. ఈ పోరాటం 2023లోనూ కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. IMF ఇటీవలి అంచనా ప్రకారం ప్రపంచంలోని మూడో వంతు ఆర్థిక వ్యవస్థలు నష్టపోయే అవకాశం 25 శాతం ఉందని వెల్లడైంది. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధి మందగమన దశకు చేరుకుంటుందని అంచనాలకు బలం చేకూరుతోంది. అలా 2023 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2 శాతం కంటే తక్కువ వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్ తెలిపింది.

చైనా పరిస్థితి ఇలా..

చైనా పరిస్థితి ఇలా..

ప్రస్తుత అంచనాల ప్రకారం 2036 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమిస్తుందని తెలుస్తోంది. ఇది గతంలో ఊహించినదాని కంటే ఆరు సంవత్సరాలు ఎక్కువ. అలాగే 2037లో తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంతం పశ్చిమ దేశాల కంటే చాలా ఎక్కువ ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తాయని అంచనాలు చెబుతున్నాయి.

భారత ఆర్థిక వ్యవస్థ..

భారత ఆర్థిక వ్యవస్థ..

2035లో భారత ఆర్థిక వ్యవస్థ విలువ 10 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. 2032 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలుస్తోంది. 2030 నాటికి యునైటెడ్ స్టేట్స్, యూరప్ అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్‌ను శాసిస్తాయని అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం కొత్త సంవత్సరం అందరికీ సవాళ్లతో కూడుకుని ఉంటుందని నిపుణుల అంచనాలు ప్రాథమికంగా చెబుతున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *