Rocket Stock: అనుకున్నది సాధించిన అదానీ.. రాకెట్ లాగా పెరుగుతున్న స్టాక్.. మీ దగ్గర ఉందేమో..!!

[ad_1]

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది డీబీ రియల్టీ కంపెనీ షేర్ల గురించే. ఈ రోజు మార్కెట్లో కంపెనీ షేర్లు అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ ముంబై రియల్టీ స్టాక్ ధర రూ.89.25 వద్ద ఉంది. దీనికి కారణం ఏమిటంటే.. DB రియాల్టీ జాయింట్ వెంచర్ రేడియస్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను గౌతమ్ అదానీ కొనుగోలు చేయటమే.

డీల్ వివరాలు..

డీల్ వివరాలు..

గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ గుడ్‌హోమ్స్.. దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ అయిన రేడియస్ ఎస్టేట్స్ & డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ ను కొనుగోలు చేస్తోంది. వివరాల ప్రకారం అదానీ గ్రూప్ రుణదాతలకు 4 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు ముందుకొచ్చింది. రేడియస్ ఎస్టేట్స్ మరియు డెవలపర్స్ ప్రైవేట్, MIG(బాంద్రా) రియల్టర్లు మరియు బిల్డర్లు జాయింట్ వెంచర్లు. ఇది డీబీ రియల్టీకి అనుబంధ సంస్థ. అదానీ గ్రూప్ తెచ్చిన ఈ రిజల్యూషన్ ప్లాన్ ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదించిన సంగతి తెలిసిందే.

అదానీ గ్రూప్ కు లాభం..

అదానీ గ్రూప్ కు లాభం..

తాజా డీల్ ద్వారా అదానీ గ్రూప్ టెన్ BKC ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకోనుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ అనేక స్థానిక, ప్రపంచ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబై ధారవికి సమీపంలో ఇది ఉంది. ధారావి పునర్నిర్మాణ కాంట్రాక్టును అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ మెుత్తం ఐదు ఎకరాల్లో విస్తరించి ఉండగా.. పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్టు రూ.25 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంది.

దూసుకెళ్తున్న స్టాక్..

దూసుకెళ్తున్న స్టాక్..

ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యింది. మార్కెట్లు ముగిసే సమయానికి నేడు స్టాక్ ధర రూ.89.25గా ఉంది. మహారాష్ట్ర కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీ షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.138.70 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.51.05గా ఉంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *