Monday, November 29, 2021

Rojaకు ఒక రూలు..చెవిరెడ్డికి మరో రూలా : సీఎం జగన్ నిర్ణయం వెనుక..!!

రోజాకు అర్దమయ్యే సరికే అంతా…

అదే సమయంలో రోజా మద్దతు దారులో కనిపించిన ఆందోళన కూడా..ఎక్కడా రోజాలో కనిపించ లేదు. కానీ, భవిష్యత్ రాజకీయాల పైన మాత్రం ఒక స్పష్టమైన అంచనా వచ్చేసింది. జగన్ ను తాను ఎంత నమ్ముకున్నా..తనకు సొంత నియోజకవర్గంలో ఉన్న ఆటుపోట్లను పరిష్కరించుకోకుంటే అసలుకే ముప్పు అని గ్రహించారు. అంతే, ఈ నామినేటెడ్ పదవి నుండి తప్పించగానే…నియోజకవర్గంలోని ప్రత్యర్ధి వర్గం ఖుషీ చేసుకుంది. ఇలాగే నియోజకర్గం పైన ఎక్కువగా శ్రద్ద పెట్టకపోతే జరిగేదేంటో రోజా గుర్తించినట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నగరిలోనే ఎక్కువ సమయం..

నగరిలోనే ఎక్కువ సమయం..

దీంతో..షూటింగ్ సమయం మినహా మిగిలిన సమయం మొత్తం నగరికే కేటాయిస్తున్నారు. అదే విధంగా నియోజకర్గంలో ఇప్పుడు డెవలప్ మెంట్ పైన ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పాదిరేడు- ఎల్.ఎం కండిగ వయా తట్నేరి నుంచి తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు కృతజ్ఞతతో ఎమ్మెల్యే రోజాకు స్థానిక నాయ‌కులు, ప్రజ‌లు పూలాభిషేకం చేసి ఘనంగా సత్కరించారు. రోజా ఎప్పుడు ఏం చేసినా వార్తల్లో నిలుస్తారు.

 జగన్ లెక్కల పై క్లారిటీ..

జగన్ లెక్కల పై క్లారిటీ..

రోజాకు ఏపీఐఐసీ పదవి పోగానే..మంత్రి పదవి దక్కుతుందా అని కొందరు.. రెడ్డి సామాజిక వర్గం నుంచి జిల్లా మంత్రిగా పెద్దిరెడ్డి కేబినెట్ లో ఉండగా…రోజాకు ఛాన్స్ లేదని మరి కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. కానీ, రోజాకు అసలు విషయం బోధ పడింది. సీఎం జగన్ లెక్కలు ఏంటో అర్దం చేసుకొనే సరికి రెండేళ్లు పైగా సమయం పట్టింది. ప్రతిపక్ష నేత గా కనిపించిన జగన్…ముఖ్యమంత్రి గా జగన్ ఒకటే కాదని స్పష్టం అయింది. జగన్ తనను ఎంత అభిమానిస్తారో..అంత కంటే ఆయన లెక్కలకు ఆయన కట్టుబడి ఉంటారని తెలిసి వచ్చింది. పార్టీ ఫస్ట్…లీడర్స్ నెక్స్ట్ అనే విధంగా రోజాకు తాజా నిర్ణయం తెలియ చేసింది.

చెవిరెడ్డి విషయంలో మాత్రం..

చెవిరెడ్డి విషయంలో మాత్రం..

ఎమ్మెల్యేకు జోడు పదవులు లేవని చెబుతున్న సమయంలోనే… రోజా నియోజకవర్గం పక్కనే ఉండే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాత్రం జోడు పదవుల్లో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూనే తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ) ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. అది కూడా నామినేటెడ్ పోస్టే. కొద్ది రోజుల క్రితం భాస్కర రెడ్డి తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ ఎక్స్ అఫీషియో మెంబర్ గానూ వ్యవహరించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గానూ ఉన్నారు. విప్ పదవి ఎమ్మెల్యేలకే ఇవ్వాల్సి ఉంటుంది.

 చెవిరెడ్డికి ప్రాధాన్యత వెనుక..

చెవిరెడ్డికి ప్రాధాన్యత వెనుక..

అయితే, చెవిరెడ్డి మాత్రం ఇంకా తుడా ఛైర్మన్ పదవిలో కొనసాగటమే ఇప్పుడు చర్చకు కారణమైంది. అదే విధంగా.. జక్కంపూడి రాజా ను కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి..మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించారు. మరి..ఈ రూలు చెవిరెడ్డికి వర్తించదా అనే చర్చ ఇప్పుడు రోజా అభిమానుల్లో మొదలైంది. అయితే, చెవిరెడ్డి తొలి నుంచి వైఎస్సార్ హాయం నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నారు. పార్టీ పరంగానూ కష్టపడతారనే పేరు ఉంది. కేసీఆర్ తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ చెవిరెడ్డికి కలిసి వస్తున్న సమీకరణాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు..ఈ అంశం చిత్తూరు జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.


Source link

MORE Articles

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

The best Cyber Monday deals happening now

Black Friday is technically over, but many of the same deals have carried over into Cyber Monday — plus a few...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe